కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు పొందిన విశాల్ ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నాడు. 47 ఏళ్ల వయసులో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయితోనే విశాల్ పెళ్లి జరగబోతుందని బలంగా ప్రచారం జరుగుతుంది. గతంలో విశాల్ పెళ్లిపై ఎన్నో వార్తలు వచ్చాయి. వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ వంటి నటీమ‌ణుల‌తో విశాల్ పెళ్లి అంటూ ప్రచారం జరిగింది. కానీ అవి చివరకు పుకార్లుగానే మిగిలాయి.


అయితే ఈసారి మాత్రం విశాల్ పెళ్లి వార్తలకు ప్రాధాన్యత సంతరించుకుంది. `నడిగర్ సంఘం` బిల్డింగ్ పూర్తయిన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో ప్రకటన చేశాడు. ఇటీవలె ఆ బిల్డింగ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. మరో రెండు నెలల్లో బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి సంగతేంటని తాజాగా మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన విశాల్ ను మీడియా ప్రశ్నించింది.

 అందుకు బదిలీస్తూ.. విశాల్గుడ్ న్యూస్ రివీల్‌ చేశాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. ఇప్పటికే తన జీవిత భాగస్వామిని కనుగొన్నానని.. తమ మధ్య పెళ్లి చర్చలు కూడా జరుగుతున్నాయని విశాల్ తెలిపాడు. తనది క‌చ్చితంగా ప్రేమ వివాహ‌మే అని.. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని విశాల్ తెలిపాడు. అయితే ప్రముఖ తమిళ నటి సాయి ధన్షిక, విశాల్‌ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతుంది.
 

తాజాగా విశాల్ నుంచి పెళ్లి ప్ర‌క‌ట‌న రావ‌డంతో.. ఆయ‌న‌కు లైఫ్ పార్ట్న‌ర్ కాబోయేది సాయి ధ‌న్షిక‌నే అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు త్వరలోనే విశాల్-సాయి ధ‌న్షిక‌ ఎంగేజ్మెంట్ జరగనుందని.. సెప్టెంబర్ లో పెళ్లి ఉండొచ్చనే వార్త‌లు కూడా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. విశాల్‌ సన్నిహిత వర్గాలు సైతం ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నాయ‌ట‌. మ‌రి ఈ వార్త‌ల‌ను విశాల్, సాయి ధ‌న్షిక క‌న్ఫార్మ్ చేస్తారా.. లేదా.. అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: