ఏంటి జయం రవి ఆర్తి ల విడాకులకు కారణం తమిళ హీరో ధనుషా. ధనుష్ వల్లే జయం రవి ఆర్తిలు విడిపోయారా..ఆర్తితో జయం రవి నిజంగానే ఎఫైర్ పెట్టుకున్నారా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోలో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజుల నుండి జయం రవి ఆర్తికి మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇందులో సింగర్ కెనీషా దూరడంతో,కెనీషాతో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే తన భర్త తనకు దూరమయ్యారని ఆర్తి పరోక్షంగా చెప్పుకుంటుంది. కానీ జయం రవి మాత్రం ఆర్తి తనని చిత్ర హింసలు పెట్టి డబ్బు కోసమే వాడుకుందని,అందుకే విడాకులు ఇచ్చేసానని చెప్పుకొస్తున్నారు. జయం రవి అత్త ఆర్తి తల్లి కూడా జయం రవి వల్ల నేను 100 కోట్ల వరకు నష్టపోయానని కొడుకు లాగా ఉన్న ఆయన ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు అంటూ స్పందించింది. 

అలా ప్రస్తుతం జయం రవి ఆర్తి కుటుంబం మధ్య ఇష్యూ జరుగుతున్న వేళ తాజాగా జయం రవి భార్య ఆర్తి హీరో ధనుష్ కి సంబంధించి ఒక సంచలన ఫోటో వైరల్ అవుతుంది.ఆ ఫోటోలో ధనుష్ ఆర్తి ఇద్దరు ఒకరిని అతుక్కొని మరొకరిని నిల్చొని తమ నాలుకలను బయటికి పెట్టి ఫొటో కి ఫోజులిచ్చారు. అయితే ఈ ఫోటోని సింగర్ సుచిత్ర తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి ఇద్దరి శరీరాలు అతుక్కుని నాలుకలు బయటికి పెట్టి ఉన్నారు. మరి ఈ ఇద్దరు వ్యక్తుల రిలేషన్ ఏంటో చాట్ జిపిటిని అడగండి అంటూ ఒక సంచలన పోస్ట్ చేసింది. గత కొద్ది రోజులుగా సుచీ లీక్స్ పేరుతో సింగర్ సుచిత్ర ఎంతోమంది నటినటుల భాగోతాలు బయట పెడుతూ ఫోటోలతో షాక్ ఇస్తుంది. ముఖ్యంగా జయం రవి ఆర్తి ల విడాకుల గొడవ జరుగుతున్న వేళ ఇలా ధనుష్ తో ఆర్తి క్లోజ్ గా ఉన్న ఫోటో సుచిత్ర లీక్ చేయడంతో మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.

అయితే సుచిత్ర లీక్ చేసిన ఈ ఫోటోపై భగీర అనే వ్యక్తి ఈ ఫోటో వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని బయటపెడుతుంది అని కామెంట్ పెట్టాడు. అయితే సుచిత్ర లీక్ చేసిన ఫోటోలో ఎలాంటి తప్పు ఉద్దేశం లేదు.ఎందుకంటే ఈ ఫోటోని స్వయంగా జయం రవి గతంలో పోస్ట్ చేశారు.. ఆర్తి ధనుష్ ఇద్దరు అన్నా చెల్లెలు లాగే ఉంటారని,వారిద్దరి మధ్య అన్న చెల్లెళ్ల బాండింగ్ ఉంటుందని స్వయంగా జయం రవి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోని సింగర్ సుచిత్ర షేర్ చేస్తూ వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వక్రీకరిస్తుంది అని చాలామంది సింగర్ సుచిత్రపై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ధనుష్ మీద కోపంతోనే సుచిత్ర ఇలా ఆయనకి లేనిపోని అఫైర్స్ అంటగడుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: