
అయితే నిజానికి ఈ సినిమాని కెవిఎస్ ప్రొడక్షన్ బ్యానర్ పైన డైరెక్టర్ హెచ్ వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్న.. జననాయగన్ అనే పేరుతో తీయబోతున్నారని.. గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో హీరోగా హీరో విజయ్ నటించిన చివరి సినిమా అన్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే భగవంత్ కేసరి సినిమా రీమిక్ కాదంటూ చిత్రబృందం కూడా తెలియజేసింది. అయితే ఈ చిత్రాన్ని హీరో విజయ్ చూశారని.. ఇందులో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎపిసోడ్ బాగా కనెక్ట్ అయిందని తెలియజేశారు.
కానీ ఈ ఎపిసోడ్ ని ఉపయోగించుకునేందుకు కేవలం రూ.4.5 కోట్ల రూపాయలను నిర్మాత సాహు కి చెల్లించినట్లుగా సమాచారం. ఆ ఒక్క ఎపిసోడ్ తప్ప జననాయగన్ సినిమాకి భగవత్ కేసరి సినిమాకి ఎలాంటి పోలిక ఉండదంటూ చిత్రబృందం తెలియజేస్తోంది. ఈ ఒప్పందం కోసమే డబ్బులు కూడా చెల్లించామంటూ చిత్ర బృందం తెలిపారు. అయితే ఈ విషయం విన్న బాలయ్య అభిమానులు ఆశ్చర్యపోతూ కేవలం ఒక్క ఎపిసోడ్ కోసమే అంత చెల్లించారా క్రేజీ సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2026న జననాయగన్ సినిమాని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.