తమన్నా ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భామ సినీ పరిశ్రమకు పరిచయమై చాలా సంవత్సరాలు అవుతోంది. తెలుగు, హిందీలో అనేక సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలోనూ హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం తమన్నా ఫుల్ ఫామ్ తో దూసుకుపోతోంది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా.... తమన్నా ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే తన లైఫ్ కొనసాగిస్తుంది.

కానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా గతం లోనే తమన్నా వెల్లడిం చారు. త్వర లోనే వివాహం చేసుకుంటామని తమన్నా, విజయ్ వర్మ చాలా సందర్భాలలో వెల్లడించారు. అంతే కాకుండా వివాహం తర్వాత వారు ఉండడానికి ఖరీదైన భవనాన్ని కూడా కొనుగోలు చేసినట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఏమైందో తెలియదు గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై తమ న్న, విజయవర్మ పరోక్షంగా బ్రేకప్ చెప్పుకున్నట్లుగా స్పందించారు. దీంతో వీరిద్దరి ప్రేమ వార్తలకు ముగింపు పలికింది.


ప్రస్తుతం తమన్నఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో భాగంగా తమన్నా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే తమన్నా మునుపటిలాగా అస్సలు లేదు పూర్తిగా మారిపోయింది. విజయ్ వర్మతో రిలేషన్ కొనసాగిస్తున్న సమయంలో తమన్నా చాలా ఫిట్నెస్ కొనసాగించింది. ఇప్పుడు మునుపటి కన్నా చాలా సన్నగా తయారయింది. దీంతో బ్రేకప్ అయిన అనంతరం తమన్నా చాలా సన్నగా అయిందని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై తమన్న ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, తమన్నా ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: