- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టార‌ర్ వార్ 2. ఈ సినిమా ఆగస్టు 14 , 2025న ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్ల లోకి రాబోతుంది.  ఈ రోజు ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుక‌గా వార్ 2 సినిమా నుంచి వ‌చ్చిన‌ వీడియో అద‌ర గొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ వీడియో ఎన్టీఆర్ కు కూడా సర్ప్రైజ్ ఇస్తుందని స్వయంగా హృతిక్ రోషన్ ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో రెండు పాటలు మాత్రమే ఉన్నాయట. అందులో ఒక సాంగ్ను హృతిక్ రోషన్ - హీరోయిన్ కియారా అద్వానీపై తెర‌కెక్కించారు.


కీయారా బికినీలో కనిపిస్తుందట. ఇక రెండో పాటను ఎన్టీఆర్ పై షూట్ చేయనున్నారు. వచ్చేనెల హృతిక్ రోష‌న్ పై ఈ సాంగ్ ను ఏడు రోజులు పాటు షూట్ చేస్తారట. ఈ సాంగ్లో తారక్ స్టెప్స్ అదిరిపోతాయని తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టార్ సినిమాలలో వార్ 2 సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని ఇండియన్ ట్రేడ్ వర్గాలు లెక్కలు కొడుతున్నాయి. పైగా ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ సినిమాకి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: