
కాగా ఇలాంటి మూమెంట్లోనే ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా సోషల్ మీడియాలో తారక్ కి సంబంధించి ట్రెండ్ అవుతున్నాయి . తారక్ - పవన్ కళ్యాణ్ ల కాంబోలో రావాల్సిన సినిమా డీటెయిల్స్ మరొకసారి నెట్టింట వైరల్ గా మారాయి . ఆ సినిమా మరేంటో కాదు "గోపాల గోపాల" . పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఆయన దేవుడిగా నటించిన సినిమా గోపాల గోపాల . వెంకటేష్ - పవన్ కళ్యాణ్ ల కాంబోలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. అభిమానులను బాగా ఆకట్టుకుంది . అయితే నిజానికి వెంకటేష్ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ ని ముందుగా అనుకున్నారట డైరెక్టర్.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ కథ విని ఈ రోల్ నాకు సూట్ కాకపోవచ్చు అంటూ డైరెక్ట్ గానే డైరెక్టర్ కి చెప్పేసారట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం చాలామంది హీరోస్ అనుకున్నారట డైరెక్టర్. నాగార్జునని కూడా అనుకున్నారట . ఫైనల్లీ ఈ పాత్ర కోసం వెంకటేష్ సెలెక్ట్ అయ్యారు . వెంకటేష్ - పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ భలే చక్కగా తెరకెక్కించాడు డైరెక్టర్ . ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే ఎంజాయ్ చేస్తూ చూసే ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ - పవన్ కళ్యాణ్ కాంబో సెట్ కావాలి అంటూ ఫ్యాన్స్ ఎంతో మంది కోరుకుంటున్నారు . ఎప్పుడు వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందో అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..!?!?