- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన తర్వాత సినిమాను దర్శకుడు మురళీ కిషోర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. లెనిన్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఏమిటంటే జూన్ మొదటి వారంలో స్పెషల్ సెట్లో ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తారట. ఈ క్లైమాక్స్ కోసం కొన్ని స్పెషల్ ఫైట్లు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫైట్లు అనంతరం అఖిల పై ఓ సాంగ్ షూట్ చేస్తారట. ఇదిలా ఉంటే ఈ లెనిన్‌ సినిమా కోసం అఖిల్ బాగా కష్టపడుతున్నాడు. మామూలుగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ అంటే మనకు బాలకృష్ణ సినిమాలు బాగా గుర్తుకు వస్తాయి. అఖిల్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్లు అవుతున్నా సరైన హిట్ లేదు.


అఖిల్ ఇప్పుడు బాలయ్య బాట లో రాయల సీమ బ్యాక్‌డ్రాప్‌ స్టోరీ తో లెనిన్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. లెనిన్ కథ‌ చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కుతుందట. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఈ సినిమాలో అందాల భామ‌ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే దసరా కు రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ త్వరగా పూర్తయితే లెనిన్ సినిమా దసరా బ‌రిలో రిలీజ్ అయిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: