లోకేష్ కనకరాజ్ - సన్ పిక్చర్స్ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న భారీ సినిమా కూలి. రజనీకాంత్ .. నాగార్జున తో పాటు అన్ని భాషల్లో హేమహేమీలు నటిస్తున్న భారీ మల్టిస్టారర్ కూలీ. ఇందు లో బాలకృష్ణ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడని టాక్ ఉంది. హిందీ - కన్నడ - మలయాళం ఇలా ఒక భాష కాదు .. అన్ని భాషలకు చెందిన సూపర్ స్టార్లు ఇందులో ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగు హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. ఏపీ - తెలంగాణ రాష్ట్రాల థియేటర్ హక్కులు కోసం ఏకంగా 42 కోట్ల మేరకు ఆఫర్ వెళ్ళిందని తెలుస్తోంది. తెలుగు హక్కుల కోసం ఈ సినిమా లో కీలక పాత్ర పోషిస్తున్న నాగార్జున - నిర్మాత నాగవంశీ తో పాటు ... బడా డిస్ట్రిబ్యూట‌ర్లు అయిన ఆసియన్ సునీల్ - దిల్ రాజు కూడా పోటీపడుతున్నారు.


వీళ్ళందరూ రకరకాల ఆఫర్లు సన్ పిక్చర్స్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ఇందులో హైయెస్ట్ బిడ్డింగ్ నిర్మాత నాగ వంశీ వేసినట్టు తెలుస్తుంది. ఆయన 42 కోట్ల మేరకు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఎవరి లాబీయింగ్‌ వారు చేస్తున్నారు ... ఎవరు బేరాలు వారు వాడుతున్నారు. ఆగస్టు 15 ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాకు ఒకరోజు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసిన నటించిన వార్ 2 సినిమా విడుదలవుతుంది. కొద్ది రోజుల్లోనే కూలి తెలుగు హక్కుల లెక్క తేలిపోనుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: