- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగింటి అల్లుడు అట్లీ ఫస్ట్ టైం టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండగా సన్ పిక్చర్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ..  . .రీసెంట్ గా అట్లీ హైదరాబాద్ వచ్చి బన్నీతో చర్చల్లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాలో ఐదుగురు హీరోయిన్ లకు ప్రాధాన్యం ఉంటుందని ఇప్పటికే వారితో చర్చలు జరిపి వారిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. .


దీపికా పదుకొనే - మృణాల్ ఠాగూగ‌ర్ - జాన్వీ కపూర్ సెలెక్ట్ అయ్యారని అలాగే భాగ్యశ్రీ బోర్సే తో కూడా చర్చలు జరుగుతున్నాయని మరో హీరోయిన్ ఎంపిక కోసం అట్లీ పలువురు హీరోయిన్ల పేర్లు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.  .ఈ హీరోయిన్ల పేర్లు వింటుంటే నెటిజన్లు అట్లీ అసలు ఏం కుక్ చేస్తున్నావయ్యా ? ఊహలకు అందటం లేదు మా మైండ్ దొబ్బుతోంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు. . దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. .


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి.. . .

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: