
చాలా అంటే చాలా కాలంగా వార్తల్లో ఉంటూ వస్తున్న ప్రాజెక్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేసి చాలాకాలం అయింది. 2024 ఎన్నికలకు కాస్త ముందు ఈ సినిమా పట్టాలు ఎక్కింది .. కొద్ది రోజులు షూటింగ్ చేశారు. శ్రీలీల హీరోయిన్ .. అయితే పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిపోవడంతో ఈ సినిమా కాస్త వెనక్కు వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తి సమయం రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఆయన ఒప్పుకున్న సినిమాలు చకచకా పూర్తి చేస్తున్నారు. హరిహర వీరమల్లు పూర్తి చేసేశారు .. ఓజి పూర్తి చేస్తున్నారు. ఇక మిగిలింది ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమానే. టోటల్ షూటింగ్ పెండింగ్ ఉంది. ఇది ఎప్పుడు పూర్తి చేస్తారు ? అన్న అనుమానాలు ఉన్నాయి. గతంలో సెట్స్ మీదకు వెళ్ళింది అంటే బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉందని అనుకోవాలి ..!
కానీ ఇప్పుడు కథలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారట. తాజాగా ఓ జి సెట్లో హీరో పవన్ ను దర్శకుడు హరీష్ కలిసారట. అదే టైంలో త్రివిక్రమ్ కూడా అప్పుడు అక్కడే ఉన్నారట. పవన్ స్క్రిప్ట్ గురించి పాత్రల .. స్వభావాలు గురించి హరీష్ మీద ప్రశ్నలు సంధించడం మొదలు పెట్టారని తెలుస్తోంది. ఆ టైంలో త్రివిక్రమ్ కలగజేసుకొని ఆయన మీ ఫ్యాన్ కదా? గబ్బర్ సింగ్ తీసాడు కదా ? మిమ్మల్ని ఎలా చూపించాలో ఏ డైలాగ్ చెప్పించాలో ? ఏ గెటప్ వేయించాలో ఆయనకు వదిలేయండి .. ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచండి అని చెప్పారట. దీంతో వెంటనే పవన్ ప్రొసీడ్ హరీష్ అనేసారని తెలుస్తోంది. జూన్ రెండో వారం నుంచి చకచక సెట్స్ మీదకు వెళుతుంది. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు