తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో సక్సెస్ సాధిస్తారు. అలాంటి వారిలో ప్రముఖ నటి శోభిత ఒకరు. ఈ భామ మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. తనదైన నటన, సినిమాలతో ప్రేక్షకుల మనసులను ఎంతగానో దోచుకుంది. తెలుగు, హిందీ, తమిళ్ లో అనేక సినిమాలలో నటించింది. తన కెరీర్ లో శోభిత నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. కాగా శోభిత సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. 

చాలా సంవత్సరాల పాటు సీక్రెట్ గా ప్రేమలో ఉన్న వీరు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత శోభిత ఎలాంటి సినిమా షూటింగ్లలో పాల్గొనడం లేదు. అంతేకాకుండా ఎలాంటి సినిమాలలోనూ నటించడానికి ఒప్పుకోవడం లేదట. దానికి గల ప్రధాన కారణం అక్కినేని నాగచైతన్యకు శోభిత సినిమాలలో నటించడం పెద్దగా ఇష్టం లేదట. ఆ కారణంగానే సినిమాలకు దూరంగా ఉంటుంది. తన భర్త కోరిక మేరకు కుటుంబ సభ్యులతోనే తన సమయాన్ని గడుపుతోంది. ఇక శోభిత వివాహం తర్వాత నిత్యం ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నారు. 

తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అనేకమంది ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ శోభిత వాటిని పట్టించుకోవడం లేదు. కాగా శోభితకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. బాలీవుడ్ లో నిర్వహించిన ఓ ఈవెంట్ కు శోభిత హాజరయ్యారు. అందులో తాను బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి హాట్ టాపిక్ గా మారారు. స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని తన నడుము అందాలను చూపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వీడియోలో శోభిత చాలా అసహ్యంగా ఉందని కొంతమంది నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. చాలా సందర్భాలలో శోభిత నటి సమంత స్టైల్ ను కాపీ కొడుతుందని కొంతమంది సమంత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపైన శోభిత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: