టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం భైరవం సినిమాలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో హీరో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ తమిళ హిట్ సినిమా గరుడన్ కి రీమేక్ గా చేశారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో డైరెక్టర్ శంకర్ కూతురు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. భైరవం సినిమా ఈ నెల 30వ తేదీన థియేటర్ లో రిలీజ్ అవ్వనుంది.

అయితే భైరవం సినిమా మరోసారి వివాదంలో చిక్కుకుంది. 2011లో డైరెక్టర్ విజయ్ కనకమెడల, మెగాస్టార్ చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్ లను ట్రోల్ చేస్తూ ఉన్న మార్ఫింగ్ పోస్ట్ ఆయన ఫేస్ బుక్ పేజీలో కనిపించింది. కానీ ఇప్పటివరకు ఆ పోస్ట్ ని ఎవరు గమనించలేదు. తాజాగా భైరవం సినిమా ప్రమోషన్స్ లో విజయ్ మెగాస్టార్ చిరంజీవికి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తను వీరాభిమానినని తెలిపాడు. కానీ ఆయన ఫేస్ బుక్ పోస్టులో మాత్రం వారిని ట్రోల్ చేస్తూ ఉన్న పోస్ట్ కనిపించింది. దీంతో మెగా ఫ్యాన్స్ బాయ్ కాట్ భైరవం అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇక తాజాగా దర్శకుడు విజయ్ ఈ ట్రోలింగ్ పై స్పందిస్తూ.. తన ఫేస్ బుక్ పేజీని ఎవరో హ్యాక్ చేశారని తెలిపారు. ఆ పోస్ట్ తను పెట్టింది కాదని చెప్పుకొచ్చారు. తనకు మెగా హీరోలంటే చాలా అభిమానం ఉందని స్పష్టం చేశారు. తను ఒక మెగా అభిమానిని అంటూ ఇలాంటి తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను అంటూ మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ 2011లో పెట్టిన పోస్ట్ ని తను ఇప్పటివరకు చూసుకోలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ మండిపడుతున్నారు.      


మరింత సమాచారం తెలుసుకోండి: