ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. ఇంతవరకు సరైన హిట్ పడనప్పటికీ.. తనదైన గ్లామర్ తో అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఈ బ్యూటీ కోసం ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కొట్లాటకు దిగారట. అయితే రియల్ లైఫ్ లో కాదండోయ్.. రీల్ లైఫ్ లోనే. భాగ్యశ్రీ బోర్సే రీసెంట్ గా సైన్ చేసిన‌ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో `కాంత` ఒకటి. ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్‌, టాలీవుడ్ యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి హీరోలుగా న‌టిస్తున్నారు.


సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 1950 మద్రాస్ బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్నారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ గా కాంత ప‌ట్టాలెక్కింది. టైటిల్ తోనే ఇదొక‌ హీరోయిన్ ఇంపార్టెంట్ మూవీ అని తెలుస్తోంది. క‌థానాయిక ప్రేమ పొందేందుకు ఇద్దరు కథానాయకులు ఉంటారని అర్థం అవుతోంది.


అంటే భాగ్య‌శ్రీ బోర్సేను పొందేందుకు దుల్క‌ర్‌, రానా నువ్వా-నేనా అన్న‌ట్లుగా ఫైట్ చేసుకోనున్నారు.ఈ త‌రుణంలో వ‌చ్చే స‌న్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయ‌ని అంటున్నారు. అయితే ఇందులో రానా ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడా? లేక సెకండ్ హీరోగా అల‌రించ‌నున్నాడా? అన్న‌ది తెలియాల్సి ఉంది. కాగా, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ తో పాటు రానా, దుల్క‌ర్ కూడా కాంత నిర్మాణంలో భాగం అయ్యారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే కాంత నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన దుల్క‌ర్‌, భాగ్య‌శ్రీ ఫ‌స్ట్ లుక్స్ కు విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా భాగ్య‌శ్రీ వింటేజ్ లుక్ సినీ ల‌వ‌ర్స్ ను మిస్మ‌రైజ్ చేసింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: