ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది తెలుగు సినీ పరిశ్రమకు నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఆ సినిమాలో తనదైన నటన, అందచందాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. నేను శైలజ సినిమా తర్వాత వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఇక మహానటి సినిమాతో ఏకంగా మహానటిగా గుర్తింపు పొందింది. ఈ సినిమాకు గాను అనేక అవార్డులను సొంతం చేసుకుంది. 


కీర్తి సురేష్ తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ్ లాంటి అనేక సినిమాలలో నటిస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటించేది. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు గ్లామర్ డోస్ కాస్త పెంచేసింది. తన అందాలను ఆరబోస్తూ సినిమాలలో నటిస్తోంది. ఎక్స్పోజింగ్, రొమాంటిక్ సన్నివేశాలకు ఆమడ దూరంలో ఉండే ఈ చిన్నది రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో ఏకంగా విజయ్ కి లిప్ లాక్ పెట్టేసిందట.

విజయ్ దేవరకొండ కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం రౌడీ 'జనార్ధన్'. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని తమ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ గత కొద్ది రోజుల క్రితమే తన చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి వివాహం హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతులలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వివాహం తర్వాత నుంచి ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచేసింది.


సినిమాలలో అవకాశాల కోసం తన అందాలను ఆరబోస్తోంది. ఈ చిన్నదాని చేతిలో ఆరు ఏడు సినిమా ప్రాజెక్టులకు పైనే ఉండడం విశేషం. కీర్తి సురేష్ కు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమవుతుందని తన అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్న సమయంలో కీర్తి సురేష్ వరుసగా సినిమాలు చేసుకుంటూ తన అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: