ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. పుష్ప-2 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ను గద్దర్ అవార్డుకు ఎంపిక చేయడం విశేషం. ఈ అవార్డులను జూన్ 14న హైటెక్స్ లో అవార్డుల ప్రధానోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్ గా రానున్నారు. అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారు. తాజాగా ఈ అవార్డు వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ గద్దర్ తెలంగాణ అవార్డులపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

పుష్ప-2 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నానని అల్లు అర్జున్ అన్నారు. ఈ గౌరవాన్ని కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉత్తమ నటుడిగా అవార్డు దక్కిన ఈ గొప్ప ఘనత మా దర్శకుడు సుకుమార్ గారిదేనని అన్నారు. నిర్మాతలు పుష్ప టీం వల్లనే ఈ సక్సెస్ సాధించాలని అల్లు అర్జున్ అన్నారు. తెలంగాణ ఫిల్మ్ అవార్డును మా అభిమానులకు అంకితం చేస్తానని అల్లు అర్జున్ అన్నారు. అభిమానులు చూపించే ప్రేమ, సపోర్ట్ నాలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయని అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ అవార్డును అల్లు అర్జున్ త్వరలోనే అందుకోనున్నారు.

కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ కారణంగా అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితాన్ని గడిపివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కావాలనే అల్లు అర్జున్ ను అరెస్టు చేయించారని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అయితే అల్లు అర్జున్ పుష్ప టు సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ఆ కారణంగానే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పైన కోపంతో ఉండి తనని అరెస్టు చేయించారని అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి గద్దర్ ఫిలిం అవార్డుల్లో ఒకే వేదిక పైన కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: