
ఈ సందర్భంగా సినిమాలో మనోజ్ వాయిస్ అచ్చ మోహన్ బాబు వాయిస్ లనే అనిపించిందని అడగ్గా.. దానికి మనోజ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. 'ముందుగా ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. నేను నటించిన గజపతి పాత్రకి చాలా డెప్త్ ఉంది. ఆ పాత్రను డైరెక్టర్ విజయ్ పవర్ ఫుల్ గా చిత్రీకరించారు. ఈ మూవీలో నేను నటన కన్నా డబ్బింగ్ కోసమే ఎక్కువగా కష్టపడ్డాను, ఏ సినిమాకి ఇలా కష్టపడలేదు. భైరవం మూవీ సక్సెస్ ని క్రెడిట్ డైరెక్టర్ కే దక్కుతుంది. ముగ్గురు హీరోలకి సమానంగా పేరు వచ్చింది. ఇక వాయిస్ విషయానికి వస్తే.. నాన్నగారి దగ్గర నుండి నాకు వచ్చిన ఆస్తి అది' అని మనోజ్ చెప్పుకొచ్చారు.
ఇకపోతే భైరవం మూవీ తమిళ హిట్ సినిమా గరుడన్ కి రీమేక్ గా చేశారు. ఈ మూవీకి కేకే రాధామోహన్ నిర్మాతగా వ్యవహరించగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. భైరవం సినిమాలో సీనియర్ నటి జయసుధ, వెన్నెల కిషోర్, ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై కూడా నటించారు. ఇకపోతే యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి 2.75 రేటింగ్ వచ్చింది.