కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో విక్రమ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరీర్లో చాలా సినిమాల్లో హీరోగా నటించిన చాలా తక్కువ సినిమాలతోనే విక్రమ్ మంచి విజయాలను అందుకున్నాడు. కానీ విక్రమ్ కి ఎన్ని అపజయాలు వచ్చినా రోటిన్ కమర్షియల్ సినిమాలలో నటించకుండా ఎప్పుడు వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ వస్తుంటాడు. అలాగే తన నటనతో అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. దానితో విక్రమ్ సినిమాలను , విక్రమ్ నటనను ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఆయనకు ఎంతో మంది అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా విక్రమ్ వీర ధీర శూర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చింది.

సినిమా ఆల్మోస్ట్ విజయం దగ్గరకు వెళ్ళింది కానీ విజయం అందుకోలేకపోయింది. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ కంప్లీట్ అయ్యే సరికి తమిళనాడు ఏరియాలో 41.50 కోట్ల కలెక్షన్లను రాబట్టగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.85 కోట్లు , కర్ణాటక ఏరియాలో 3.10 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.55 కోట్లు , ఓవర్సీస్ లో 17 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 33.50 కోట్ల షేర్ ... 69 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 36 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ఓవరాల్ గా 2.5 కోట్ల నష్టాలను అందుకొని యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా మరో కొన్ని కలెక్షన్లను వసూలు చేసి హిట్టు స్టేటస్ను అందుకుంటే బాగుండేది అని అభిప్రాయాలను విక్రమ్ అభిమానులు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: