
ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కువగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి.అప్పట్లో హథ్రాస్ లో భోలే బాబా సభ పెట్టిన సమయంలో 100 కి పైగా మంది మృతి చెందారు.అలాగే ఈ ఏడాది జరిగిన కుంభమేళలో కూడా తొక్కిసలాట జరిగి అప్పుడు చనిపోయారు. తిరుమలలో కూడా తొక్కిసలాట జరిగి కొంతమంది ప్రాణాలు విడిచారు.ఇక పుష్ప టు విడుదల సమయంలో తొక్కిసలాట జరిగి ఒక నిండు ప్రాణం బలిగొంది.మరో చిన్న ప్రాణం కొన ఊపిరితో కొట్టుకొని ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాడు. ఇక తాజాగా 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో కప్పు గెలిచిన ఆర్సిబి విజయోత్సవ ర్యాలీ కర్ణాటకలోని చిన్న స్వామి స్టేడియంలో చేసిన సెలబ్రేషన్స్లో పాల్గొన్న ఎంతోమంది అభిమానులు అత్యుత్సహాం ప్రదర్శించి ఒకేసారి పరుగున రావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దాంతో ఒకరి మీద ఒకరు పడి ఊపిరాడక తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది మృతి చెందారు.