
ఇక ఇప్పుడు రెండు రోజులు గ్యాప్ తీసుకుని జూన్ 5 నుంచి విజయవాడలో మరో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు చిత్ర యూనిట్ .. ఇక ఇప్పుడు విజయవాడ షెడ్యూల్ తో సినిమాలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తవుతుంది .. అలాగే తర్వాత జూన్ చివరకల్లా మిగిలిన షూటింగ్ అంతా పూర్తి చేయాలని దర్శకుడు సుజిత్ భావిస్తున్నారు . జులై , ఆగస్టులో పోస్ట్ ప్రొడక్షన్ చేసి సెప్టెంబర్ 25న చెప్పినట్లుగానే సినిమాలు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు . అలాగే ఈ సినిమాపై అంచనాలు మాటల్లో చెప్పడం కష్టంగా మారింది ఓజి ఫస్ట్ డే నుంచి ఇదే హైప్ మెయిన్టైన్ చేస్తూ వస్తుంది. ముంబై బెస్ట్ మాఫియా యాక్షన్ డ్రామగా ఓజి మూవీ వస్తుంది ..
అలాగే ఇందులో ఓజాస్ గంభీర అనే పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు .. రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ ఉంటుందని తెలుస్తుంది .. అలాగే ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో .. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు . అలాగే ఓజి తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా పవన్ డేట్స్ ఇచ్చారు .. జూలైలో ఈ సినిమా షూటింగ్ కు వెళ్ళనున్నారు పవన్ ఇప్పటికే హరీష్ శంకర్ కూడా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు .. ఈ సినిమాను రెండు నెలల్లో పూర్తి చేయాలని కూడా చూస్తున్నారు పవర్ స్టార్ అన్ని కుదిరితే రాబోయే 365 రోజుల్లో డిప్యూటీ సీఎం నుంచి ఏకంగా మూడు సినిమాలు రాబోతున్నాయి .