అన్ని అనుకున్నట్టే జరిగితే త్వరలోనే ఘట్టమనేని అభిమానులు గుడ్ వినబోతున్నారు అంటూ సినీ వర్గాలలో ఓ న్యూస్ తెగచక్కర్లు కొడుతుంది . ఘట్టమనేని అభిమానులకి నిజంగా అది జరిగితే మాత్రం ఓ పండగనే చెప్పాలి.  ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు కానీ పెళ్లి తర్వాత భర్త కోసం పిల్లల కోసం సినిమాలను మానేసుకున్న హీరోయిన్స్ చాలా చాలా తక్కువ.  పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సినిమాలకి దూరంగా ఉండి పిల్లలు ఒక ఏజ్ వచ్చాక సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ స్తూ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెడుతూ ఉంటారు కొంతమంది హీరోయిన్స్ .


కానీ మహేష్ బాబు భార్య నమ్రత మాత్రం అలా కాదు . భర్త కోసం తనకి ఎంతో ఇష్టమైన సినిమాలను దూరం పెట్టేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 20 ఏళ్ల నుంచి సినిమాలకు దూరంగానే ఉంటుంది నమ్రత. ఈ 20 ఏళ్లలో నమ్రతకు ఎన్నో ఎన్నో మూవీలలో ఆఫర్స్ వచ్చాయి . కానీ నమ్రత మాత్రం ఏ ఒక్క మూవీ ఆఫర్ ని కూడా ఓకే చేయలేదు.  నమ్రత తన భర్త తన పిల్లలే ప్రపంచం అనుకుంటూ భర్త  బిజినెస్ పనులను చూసుకుంటుంది . అయితే ఆమె చాలా ఇంటర్వ్యూలలో కూడా సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంటృఈ ఇచ్చే ఉద్దేశం లేదు అంటూ ఘాటు గానే సమాధానం ఇచ్చింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా నమ్రత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న వార్త సినీ వర్గాలలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.



గతంలో మిస్ యూనివర్స్ పోటీలలో తన అందంతో ఎలా అయితే ఆకట్టుకుందో అచ్చం అలాగే తయారై ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలను పంచుకుంటుంది . ఈ ఫోటోలు చూసిన వారందరూ నమ్రత ఈజ్ బ్యాక్ అంటున్నారు . ఒక్కవేళ్ల అదే నిజం అయితే మాత్రం త్వరలోనే  సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతుంది నమ్రత అంటూ మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు నమ్రత ఇటీవల మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే . వారిని చూశాక మళ్ళీ తనకి తన పాత రోజులు గుర్తుకు వచ్చాయేమో అందుకే ఇప్పుడు ఇలా రెడీ అయ్యి ఫోటోలు కి ఫోజులు ఇస్తుంది .. తన కెరీర్ ని బిల్డ్ చేసుకోవడానికి మళ్ళీ నమ్రత ప్రయత్నం చేయబోతుంది అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . ఏది ఏమైనా సరే నమ్రత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తే మాత్రం అభిమానులు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు . మరి చూడాలి నమ్రత ఏం చేస్తుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: