
పాన్ ఇండియ హీరో ప్రభాస్ హీరో గా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో “కల్కి 2898 ఎడి” కూడా ఒకటి .. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే రికార్డ్ కలెక్షన్లో సాధించి న సినిమా గా నిలిచింది .. ఈ సినిమా కి రెండు భాగం కోసం కూడా చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఈ మధ్య లో కొన్ని రూమర్స్ వచ్చాయి .. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా సాలిడ్ క్లారిటీ అయితే బయటికి వచ్చింది ..
అలాగే ఈ సినిమా నిర్మాణం పనులు అన్ని దగ్గరుండి చూసుకుంటున్న స్వప్న దత్ , ప్రియాంక దత్‌లు నుంచి కూడా ఓ అరుదైన క్లారిటీ వచ్చేసింది .. కల్కి 2 ఇప్పటికే 30 % షూటింగ్ కంప్లైంట్ అయింది అని కూడా తెలుస్తుంది .. అంతేకాకుండా వీటి తో పాటు గా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఎంతో వేగంగా జరుగుతున్నాయ ని కూడా చెప్పుకొచ్చారు .. ఇక వీటి తో పాటుగా దీపికా పదుకోణ్ పై వస్తున్న రూమర్స్ అన్నీ కూడా చిత్ర యూనిట్ కొట్టి పడేసింది .. ఇక ఆమె పార్ట్ 2 లో కూడా ఉంటున్నారని కన్ఫామ్ చేశారు .. ఇలా కల్కి 2 పై ఓ క్లారిటీ అయితే చాలా మందికి వచ్చినట్టే అని చెప్పాలి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు