- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మార్కో విజయం తర్వాత క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత షరీఫ్ మహమ్మద్, తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా కట్టలన్ ను అనౌన్స్ చేశారు. ఇది పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హై-యాక్షన్ థ్రిల్లర్. ప్రముఖ నటుడు ఆంటోనీ వర్గీస్ (పేపే) హీరోగా నటిస్తున్నారు. దర్శకత్వం పౌల్ జార్జ్.


ఈ చిత్రంలో కీలక పాత్రలో సునీల్ నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సునీల్ స్టయిలీష్ లుక్ లో కనిపిస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ అదిరిపోయింది. ఈ మూవీకి కాంతార 2 ఫేం అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది. వర్షంలో తడిచిన పేపే, చుట్టూ పడి ఉన్న మృతదేహాలు , ఏనుగు దంతాల మధ్య నిలబడి వుండటం కథలో ఉండబోయే వైలెన్స్  సూచిస్తోంది. మార్కో స్థాయిని మించి ఉండబోతోందని సంకేతాలు ఇస్తోంది ..


జైలర్, లియో, జవాన్, కూలీ లాంటి చిత్రాలకు టైటిల్ ఫాంట్స్ డిజైన్ చేసిన ఐడెంట్ ల్యాబ్స్ ఈ సినిమా కి కూడా టైటిల్ డిజైన్ చేశారు.కంటెంట్, మార్కెటింగ్ పరంగా క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుండగా, పేపే హై ఇంటెన్సిటీ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తరుణంలో కట్టలన్ నిజంగా ఒక గొప్ప సినీ అనుభూతి కావడంలో సందేహమే లేదు. .


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి.. .

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: