
ఆయన క్యారెక్టర్ గురించి తప్పు తప్పుగా మాట్లాడింది . కానీ బాలయ్య మాత్రం అసలు ఏ విధంగా పట్టించుకోలేదు. స్వయాన హీరోయిన్ అంజలినే "బాలయ్య అలా చేయలేదు అది మా ఇద్దరి మధ్య ఉన్న చనువు" అంటూ ఓపెన్ గా వీడియో రిలీజ్ చేసిన కావాలనే కొందరు పని పాట లేని బ్యాచ్ బాలయ్య వ్యక్తిగత జీవితంపై నెగిటివ్ గా ట్రోల్ చేసే విధంగా మాట్లాడుకున్నారు. అయితే బాలయ్య మాత్రం ఎప్పుడూ కూడా అలాంటి నెగిటివ్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యిందే లేదు . "ఎవరు ఏమనుకున్నా సరే నేను నేనేంటో నా కుటుంబానికి తెలుసు .. నా ఫాన్స్ కి తెలుసు మిగతా వాళ్ళకి తెలియాల్సిన అవసరమే లేదు" అంటూ ఆయన పని చేసుకుంటూ వెళ్లారు.
కేవలం హీరోయిన్ అంజలి విషయంలో మాత్రమే కాదు గతంలో హనీ రోజ్ తో దిగిన ఫోటో కూడా ఎంత వైరల్ అయిందో ఎంత రచ్చ రంబోలా చేసారో కొంతమంది ఆకతాయిలు అందరికీ తెలిసిందే . కానీ బాలయ్య మాత్రం తనపై నెగిటివిటీ క్రియేట్ అయిన నెగటివ్గా మాట్లాడుకున్న ఏ విధంగా వాళ్లపై స్పందించరు . ఎందుకంటే బాలయ్యకి అంత నమ్మకం వాళ్ళ ఫ్యాన్స్ పైనే. నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడు బాలయ్యని సపోర్ట్ చేస్తారు అన్న ధీమాతోనే బాలయ్య ఎవడో ఏదో కూశాడు వాడి గురించి నేను రియాక్ట్ అవ్వాలి అని అనుకోడు. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి హీరో ఉండటం గ్రేట్ . చిన్న రకమైన రూమర్ వస్తేనే సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్ట్లు పెట్టేస్తుంటే.. కానీ బాలయ్య మాత్రం అలాంటివి ఏవి పట్టించుకోఖుండా తన పని తాను చేసుకునిపోతున్నాడు. ఆ విషయంలో బాలయ్య కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే . నందమూరి ఫ్యామిలీకి రారాజే బాలయ్య అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు నందమూరి అభిమానులు..!