గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. జాన్వి కపూర్ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... జగపతిబాబు , శివరాజ్ కుమార్ ఈ మూవీలో అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పెద్ది సినిమా తర్వాత చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

దానితో పెద్ది సినిమా పనులు తుది దశకు రాగానే చరణ్ , సుకుమార్ కాంబోలో మూవీ స్టార్ట్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా చరణ్ తన తదుపరి మూవీని సుకుమార్ తో కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఈ కాంబో మూవీ ఫిక్స్ అయినట్లు , దీనిని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మించనున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే రాబోతునట్లు తెలుస్తోంది. ఇలా చరణ్ , త్రివిక్రమ్ కాంబోలో మూవీ ఫిక్స్ అయింది అనే వార్తలు బయటకు రావడంతో చరణ్ ఫాన్స్ ఓ వైపు ఆనంద పడుతూనే  మరో వైపు కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం చరణ్ కు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంది. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు.

ఆయన ఫ్యామిలీ స్టోరీలను అద్భుతంగా రూపొందిస్తూ ఉంటాడు. దానితో చరణ్ అభిమానులు త్రివిక్రమ్ పాన్ ఇండియా మార్కెట్ ను ఉద్దేశించి కాకుండా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని తీసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే అది అద్భుతమైన విజయాన్ని అందుకునే అవకాశాలు ఉంటాయి అని , అలాగే సినిమా కూడా చాలా తొందరగా పూర్తి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చరణ్ అభిమానులు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: