
సిల్వర్ సీన్ మీద ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది .. ఓ 20 ఏళ్ల కిందట సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేసిన జోనర్స్ మళ్లీ రిపీట్ కాబోతున్నాయి .. అప్పట్లో కలెక్షన్ వర్షం కురిపించిన ఈ ఫార్ములా మళ్లీ తెర మీదకు వస్తానంటుంది .. ప్రజంట్ అలాంటి ఓ క్రేజీ ట్రెండ్ మరోసారి బిగ్ స్క్రీన్ మీద సందడి చేయడానికి రెడీ అవుతుంది ? ఈ ట్రెండ్ తో అభిమానులు కూడా కొంత డబల్ హ్యాపీగా ఉన్నారు . చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న మెగా 157 లో చిరంజీవి డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు ..
అలాగే ఒక క్యారెక్టర్ అనిల్ మార్క్ కామెడీ జోనర్ లో ఎంటర్టైన్ చేస్తే , మరో క్యారెక్టర్ చిరు స్టైల్ యక్షన్ మోడ్లో ఉండబోతుందట .. ఈ అప్‌డేట్‌తో మెగా అభిమానులు కొంత డబుల్ ఖుషి అవుతున్నారు . అలాగే ప్రస్తుత టైమ్స్ లో వెండి తెర మీద మల్టీ రోల్స్ ట్రెండ్ గట్టిగా కొనసాగుతుంది .. అల్లు అర్జున్ , అట్లి కాంబోలో రాబోతున్న గ్లోబల్ మూవీలో కూడా బన్నీ మూడు విభిన్న క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు .. ఈ సినిమా తో అట్లి , అల్లు అర్జున్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారు అనేది కూడా అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు . ఇప్పటికే రీసెంట్గా దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించారు ..
తండ్రి కొడుకులుగా నటించిన ఎన్టీఆర్ తొలి భాగంలో ఒకే ఫ్రేమ్లో రెండు రోల్స్ లో కనిపించకపోయిన దేవర 2లో ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపించే అవకాశం ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇక డార్లింగ్ ప్రభాస్ కూడా డబుల్ బొనాంజ ప్లాన్ చేసుకుంటున్నారు .. ది రాజాసాబ్ సినిమాలో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు .. ఒక క్యారెక్టర్ లో స్టైలిష్ లుక్ లు అదర కొడితే మరో లుక్ లోఓల్డేజ్ రాయల్ ఎటైర్‌లో భయపెట్టబోతున్నాడు .. ఇలా ఇప్పుడు స్టార్ హీరోలు అంత అభిమానులకు డబుల్ బోనాంజ ఇచ్చేందుకు తెగ కష్టపడుతున్నారు .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు