చిత్ర పరిశ్రమ నుంచి ఓ పెద్ద సినిమా వస్తుంది అంటే నిర్మాతకు , టీమ్‌కు ఎంతో టెన్షన్ .. ఎన్ని కోట్ల బడ్జెట్ అన్నది తెలియదు కానీ కన్నప్ప‌ అనేది కూడా పెద్ద సినిమానే .. మరో రెండు వారాల్లో రిలీజ్ కు రానుంది ఈ సినిమాకు ముందు వెనక ఎన్నో సినిమాలు వస్తున్నాయి .. వాటికి కన్నప్పకు తేడా .. మంచు ఫ్యామిలీ సినిమా కనుక దీని మీద ఎవరు ఆస‌క్తి పెట్టలేదు .. ఎప్పుడు మొదలైందో .. కరోనా ముందు మొదలైందో తెలియదు కానీ ఇప్పుడు విడుదలకు రానుంది . అయితే కుబేర , కింగ్డమ్ , హరిహర వీరమల్లు ఇలా చాలా సినిమాలు ఇదే సమయం లో కాస్త అటు ఇటుగా రాబోతున్నాయి ..
 

అయితే ఇక్కడ వాటి అన్నిటికీ ఒకటే వర్క్ టెన్షన్ ...  మార్కెటింగ్ , రికార్డింగ్ థియేటర్లు ఇలా అన్ని .. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారో తెలియదు . అయితే ఇక్కడ కన్నప్ప విషయంలో ఏ టెన్షన్ ఉన్నట్లు కనిపించడం లేదు .. అసలు హడావిడి లేకుండా ఎంతో సింపుల్గా ఫంక్షన్లు చేస్తున్నారు .. ఎప్పుడు సెన్సార్ అయిందో కూడా అర్థం కావటం లేదు .. చాలా సింపుల్ గా మార్కెట్ చేసేసారు .. అడ్వాన్స్ పంపితే పంపండి లేదంటే లేదు .. జస్ట్ 6% మీద హక్కులు తీసుకోండి అంటూ ఎంతో సింపుల్గా ఫిక్స్ చేసేసారు .. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతే సింపుల్ గా కంప్లీట్ అయిపోయింది ..


 ఇక మార్కెటింగ్ టెన్షన్ కూడా లేకుండా చేశారు . ఇక్కడ మనకి అర్థం కాని విషయం ఏమిటంటే నాన్ ధియేటర్ కూడా ఏదో తిమ్మిరి బొమ్మిడి చేసేసారు పే పర్ వ్యూ లాంటిది .. అలాగే ఈ సినిమా చేయడానికి పలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఆస్తులు తాకట్టుపెట్టి అప్పు తెచ్చా అని అంటున్నారు మోహన్ బాబు .. అందువల్ల ఈ సినిమా రిలీజ్ ముందు అప్పు తీర్చాల్సిన బాధ కూడా లేదు .. అలాగే మిగిలిన టెన్షన్ ఒకటే సినిమా ఎలా వచ్చింది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది అది ఆ ఒక్క దేవుడికి మాత్రమే తెలుసు .  ఇలా కన్నప్ప విషయంలో ఎలాంటి టెన్షన్లు లేకుండా మంచు విష్ణు అన్ని పనులు ఎంతో కూల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: