బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ టాలీవుడ్ హిట్ కాంబినేషన్లలో ఒకటి. ఈ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు తెరకెక్కగా ఈ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించాయి. బన్నీ త్రివిక్రమ్ కాంబోలో మరో ప్రాజెక్ట్ కు సంబంధించి వార్తలు వినిపించినా వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ విషయంలో బన్నీ తీరు రైటేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన స్థాయిలో  ఇతర  భాషల ప్రేక్షకులను మెప్పించలేదు. పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించిన అనుభవం సైతం ఈ దర్శకుడికి లేదనే సంగతి తెలిసిందే. మరోవైపు బన్నీ అట్లీ కాంబో మూవీ హాలీవుడ్ లెవెల్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమా బన్నీ రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచడం పక్కా  అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  అందుకే మొదట ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే త్రివిక్రమ్ సినిమా నుండి  బన్నీ తప్పుకోవడానికి ఇతర కారణాలు సైతం ఉన్నాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.  ఏది ఏమైనా బన్నీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛే ముందే ఆలోచించుకుంటే మంచిది.  గతంలో బన్నీ ఐకాన్ అనే ప్రాజెక్ట్ ను ప్రకటించగా  కొన్ని కారణాల వాళ్ళ ఈ సినిమా కూడా ఆగిపోయింది.  మరోవైపు బన్నీతో సినిమా తెరకెక్కించాలని ఆశ పడుతున్న దర్శకులు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

బన్నీ పారితోషికం సైతం ఊహించని స్థాయిలో ఉంది.  ఒక్కో సినిమాకు 150 నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో బన్నీ పారితోషికం అందుకుంటున్నారు.  ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడం అందరు నిర్మాతలకు సాధ్యం కాదు. సినిమాకు  ఏ మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చినా నిర్మాతల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే  సంగతి తెలిసిందే.  అల్లు అర్జున్  భవిష్యత్తు ప్రణాళికల గురించి స్పష్టత  రావాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: