
నేటితరం ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోవడంతో ప్రముఖ దర్శకులు కూడ తాము తీసే సినిమాల విషయంలో పూర్తి తడబాటుకు గురి అవుతున్నారు. దక్షిణాది సినిమా రంగం గరవింప దగ్గ దర్శకుడుగా కొన్ని దశాబ్ధాల పాటు ఇండస్ట్రీని షేక్ చేసిన మణిరత్నం శంకర్ లాంటి దర్శకులు కూడ నేటితరం ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు.
కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘ధగ్ లైఫ్’ ఈ దశాబద్ధపు భయంకరమైన ఫ్లాప్ గా గుర్తింపు పొందడంతో ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ అవుతుంతుందో ఎవరు అంచనాలు వేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి వరస హిట్స్ అందిస్తున్న ఒక కొత్త సక్సస్ ఫార్మలా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సక్సస్ ఫార్ములా మ్యాడ్ కామెడీ.
సినిమా కథలో వాస్తవాల గురించి పట్టించుకోకుండా కేవలం ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని ఈ ఫార్ములతో తీసిన సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి కి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిర్మాతలకు బయ్యర్లకు కాసుల వర్షం కురిపించింది. లాజిక్ లేని కామెడీ సీన్స్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ లో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’, ‘సింగిల్’..సినిమాలలో కూడ కథ లేకపోయినా మ్యాడ్ కామెడీ ఉండటంతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు.
కేవలంప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా ప్రతి సన్నివేశం ఈ సినిమాలో ఉంది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన మీమ్స్‌ను, ట్రెండీ మాటలను ఈ సినిమాల్లో బాగా ఉపయోగించుకున్నారు. గతంలో వచ్చిన.’ జాతిరత్నాలు, మ్యాడ్, ఆయ్, మత్తు వదలరా-2’ సినిమాలు కూడ ఈ కోవకు చెందినవే. యూత్ ప్రేక్షకులు ఫ్యామిలీ ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు ఎంజాయ్ చేస్తూ ఉండటంతో చాలామంది దర్శకులు నిర్మాతలు ఇలాంటి తరహా కథలు కావాలని రచయితలను అడుగుతున్నట్లు టాక్. దీనితో ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందో అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది. .