ఎక్కడైనా వెండి తెరపై బిజీగా ఉన్నా హీరోయిన్ల పేర్లు ఎక్కువగా హెడ్ లైన్స్ లో వినిపిస్తూ ఉంటాయి .. కానీ ఇప్పుడు ఈ రూల్ ను బ్రేక్ చేస్తున్నారు కొంతమంది భామలు .. పెద్దగా సినిమాల్లో లేకపోయినా వార్తల్లో ఉండేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు .. ఇలా చాలావరకు విజయం కూడా సాధిస్తున్నారు .. స్టార్ బ్యూటీ సమంత నుంచి సినిమా అప్డేట్ లేకున్నా ఎక్కువగా పర్సనల్ అప్డేట్స్ వస్తున్నాయి .. ఈ బ్యూటీ వెకేషన్స్ , ట్రీప్స్ రిలేషన్షిప్ వార్తల తో సోషల్ మీడియా లో తెగ ట్రెండింగ్ లో ఉంటుంది . ఇవి చాలుదు అన్నట్టు గా తన మార్కు స్టేట్మెంట్స్ తో మీడియా అటెన్షన్ మొత్తం తన మీదకు తిప్పుకుంటుంది ఈ ముద్దుగుమ్మ .. తాజా గా సక్సెస్ అంటే స్వేచ్ఛగా ఉండటమే అంటూ సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి ..


ఇక రీసెంట్ గా అనుష్క కూడా ఈ లిస్టులో ఆడ్ అయింది .. ఎంతో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న స్వీటీ పేరు అన్ని ఇండస్ట్రీలో ఇప్పుడు మారుమోగితోంది  .. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న పాన్ ఇండియా మూవీ ఘాటితో పాటు మలయాళ మూవీ  ఖతనార్ , తమిళ సినిమా ఖైదీ 2 తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు అనుష్క .. ఇలా సీనియర్ హీరోయిన్ల కాదు యంగ్ హీరోయిన్స్ కూడా న్యూస్ హెడ్ లైన్స్ లో ఫ్లాష్ అయ్యేందుకు బాగా కష్టపడుతున్నారు .. త్వరలో మిత్ర మండలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నిహారిక ఎన్ ఎం మొదటి ఈవెంట్ తోనే న్యూస్ లో టాపర్ గా మారిపోయారు .. అలాగే టీజర్ లాంచ్ ఈవెంట్లో అల్లు అరవింద్ దృష్టి ఆకర్షించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు ..



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: