తమిళ నటుడు ధనుష్ తాజాగా టాలీవుడ్ టాలెంట్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జునమూవీ లో ఈ కీలకమైన పాత్రలో నటించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని రేపు అనగా జూన్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి ఎన్ని కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , తమిళనాడు ఏరియాలో 18 కోట్లు , కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 5.50 కోట్లు , ఓవర్సీస్ లో 8.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 66 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 66 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: