కుబేర సినిమాకు ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్ల నుంచే సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చేసింది. ముందుగా సింపుల్‌గా క‌థ చెప్పుకోవాలంటే ఆయిల్ స్కామ్‌లో ల‌క్ష కోట్లు చేతులు మార్చాల్సి వ‌స్తుంది. ఆ డ‌బ్బు బినామీ పేర్ల‌తో మంత్రులు, అధికారుల‌కు బ‌దిలీ చేయాలి. ఆ బినామీలుగా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి న‌లుగురు బిచ్చ గాళ్ల‌ను ఎంచుకుంటారు. అందులోనే ఒక‌డు దేవా ( ధ‌నుష్ ) . ఈ న‌లుగురిలో ఒక్క‌రికి అక్ష‌ర‌జ్ఞానం ఉండ‌దు. త‌మ వెన‌క ఏం జ‌రుగుతుందో ?  కూడా తెలియ‌దు. ఇదంతా ఓ మాజీ సీబీబీ అధికారి దీప‌క్ (నాగార్జున‌) ఆధ్వ‌ర్వంలో న‌డుస్తున్నా అత‌డు మంచి వాడే అయినా కూడా ఏం చేయ‌లేని ప‌రిస్థితిలో ఇరుక్కు పోతాడు. ఎందుకంటే అత‌డు కూడా కార్పొరేట్ శ‌క్తుల చేతుల్లో కీలుబొమ్మ అయిపోతాడు. మ‌రి ఈ బిగ్ స్కామ్ లో ల‌క్ష కోట్లు చేతులు మారాయా ?  లేదా మ‌ధ్య‌లో వ‌చ్చిన ఆటంకాలు ఏమిటి ?  తిరుప‌తిలో బిచ్చ‌గాడి గా ఉన్న దేవ ఈ గేమ్‌లో ఎలా ఇరుక్కున్నాడు ? అందులోనుంచి బ‌య‌ట ప‌డ్డాడా ?  లేదా ? అన్న‌దే మిగిలిన క‌థ‌.


మామూలుగానే ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ కమ్ముల క‌థ‌ల‌న్నీ ఒకే త‌ర‌హాలో కాలేజీ స్టోరీలు, ప్రేమ క‌థలు, ఎమోష‌న‌ల్ డ్రామా తో ఉంటాయి. కానీ ఈ సినిమా విష‌యంలో అందులోనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అవినీతి సొమ్ము ఎలా ?  చేతులు మారుతుంద‌న్న కోణంలో చూపించాడు.  ఈ విష‌యాల‌ను చాలా లోతుగా అధ్య‌య‌నం చేసి మ‌రీ రాసిన క‌థ ఇది. న‌లుగురు బిచ్చ‌గాళ్ల బ‌తుకులు... స‌డెన్‌గా వారి జీవితాలు తారుమారు కావ‌డం.. ఆనందం, ఆ వెంట‌నే విషాదం.. వాటి చుట్టూ న‌డిపిన సీన్లు మ‌న‌స్సును అలా ట‌చ్ చేస్తాయి. ఆ కార్పొరేట్ మాయ‌లో దీప‌క్ ఎలా బ‌లి ప‌శువు అయ్యాడ‌న్న సంగ‌తి తెలుసుకోవ‌డం... దేవా త‌ప్పించుకుని పారిపోవ‌డం ద‌గ్గ‌ర నుంచి క‌థ మ‌రింత ర‌క్తి క‌డుతుంది. చివ‌ర‌కు దీప‌క్ పాత్ర‌ను ముగించిన తీరు కూడా శాటిస్‌పైగా ఉంటుంది. శేఖ‌ర్ క‌మ్ముల త‌న స్కూల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. క‌మ‌ర్షియ‌ల్‌గా ఇలాంటి సినిమాలు ఆడితే మ‌రిన్ని సినిమాలు ఈ త‌ర‌హాలో వ‌స్తాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: