కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసులలో ఒకరు అయినటువంటి మంచు విష్ణు తాజాగా కన్నప్ప అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ పెద్ద ఎత్తున ప్రచారాలను చేస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ , అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ , శివరాజ్ కుమార్ , మోహన్ బాబు , కాజల్ అగర్వాల్ లాంటి ఎంతో మంది అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీ నటులు నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇది ఇలా ఉంటే ఓ విషయంలో ఈ మూవీ యూనిట్ పుష్ప సినిమాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అది ఎందులో అనుకుంటున్నారా ..? రన్ టైమ్ విషయంలో ... అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ దాదాపుగా 3 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా దాదాపుగా 3 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు రావడంతో మూవీ యూనిట్ చాలా పెద్ద రిస్క్ చేస్తుంది. అంత రన్ టైమ్ అంటే ప్రేక్షకులకు విసుగు వచ్చే అవకాశం ఉంది. సినిమా ఏ కాస్త సినిమా బోర్ కొట్టిన ఆ మూవీ రన్ టైమ్ ఆ మూవీ కి పెద్ద మైనస్ అవుతుంది అని అనేక మంది అభిప్రాయ పడ్డారు. కానీ ఆ మూవీ బృందం వారు రిస్క్ చేసి భారీ రన్ టైమ్ తో ఆ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే కన్నప్ప సినిమా ఏకంగా 3 గంటల 15 నిమిషాల 2 సెకండ్ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో చాలా మంది భారీ రన్ టైమ్ తో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లయితే మూవీ మొత్తం ప్రేక్షకులను ఆకట్టుకుంటే పర్లేదు కానీ ఏ కాస్త బోర్ కొట్టిన ఆ సినిమా రన్ టైమ్ ఆ మూవీ కి మైనస్ అవుతుంది అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి కన్నప్ప మూవీ రన్ టైమ్ ఈ మూవీ కి ప్లస్ అయ్యేనా ..? లేక మైనస్ అయ్యేనా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: