
అయితే రష్మిక మందన్నా ఇలా బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు హిట్స్ కొడుతున్న కూడా ఓ హీరో మాత్రం అసలు రష్మిక నా సినిమాలో హీరోయిన్ గా వద్దు అంటూ తేల్చి చెప్పేస్తున్నాడట . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు తెలుగు ఫిలిం సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. రష్మిక మందన్నా ని హీరోయిన్గా తన సినిమాలో వద్దు అంటున్న హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ . పాన్ ఇండియా లెవల్ లో సంపాదించుకున్న స్టార్ . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో ఆమె హీరోయిన్గా వద్దు అంటూ తేల్చి చెప్పేసాడట . నిజానికి వీళ్ళ కాంబోలో రావాల్సిన ఫస్ట్ సినిమా "దేవర".
"దేవర" సినిమాలో జాన్వి కపూర్ కన్నా ముందుగా రష్మిక మందన్నా హీరోయిన్గా అనుకున్నారట కొరటాల శివ. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆమెని రిజెక్ట్ చేశారట . వరుస కాల్ షీట్స్ ఉండడం ఆమె ఈ సినిమాకి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం ఎందుకు అంటూ ఆమెని సినిమాలో వద్దన్నారట. ఇక తర్వాత బాలీవుడ్ లో వార్ 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా రష్మిక ని ఓ పాత్రలో చూస్ చేసుకున్నారట మేకర్స్ . కానీ ఆమెకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకునేసిందట .
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఎప్పటినుంచో రష్మిక మందన్నా హీరోయిన్ హీరోయిన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కానీ స్వయాన ఎన్టీఆర్ ఆమెని హీరోయిన్ గా వద్దన్నారట . క్రేజ్ ఉన్న హీరోయిన్ ని తీసుకొని హిట్ కొట్టడం కాదు క్రేజ్ లేని బ్యూటీ ని తీసుకొని హిట్ కొట్టడం రియల్ సక్సెస్ అంటూ ప్రశాంత్ నీల్ కి. రష్మిక ఈ సినిమాలో వద్దు అంటూ తెగేసి చెప్పేసారట అలా జూనియర్ ఎన్టీఆర్ ఒక హిట్ హీరోయిన్ రిజెక్ట్ చేశాడు అంటూ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు . కొంతమంది ఎన్టీఆర్ కే సపోర్ట్ చేస్తున్నారు . క్రేజ్ ఉన్న హీరోయిన్ తో హిట్ కొట్టడం ఏంటి..? క్రేజీ లేని హీరోయిన్ తో హిట్ కొట్టడమే రియల్ హీరోయిజం అంటూ మాట్లాడుతున్నారు . మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు అనే చెప్పాలి అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా ఆయనను పొగిడేస్తున్నారు..!!