
టాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ కి ముందు సహజంగానే చాలా టెన్షన్ ఉంటుంది. ఇంకా సాంగ్స్ పూర్తవలేదని .. నేపథ్య సంగీతం పూర్తి కాలేదని ... ఎడిటింగ్ వర్క్ మిగిలి ఉందని ... సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉందని ఇలా రకరకాల చర్చలు , కంప్లైంట్లు సహజంగానే వస్తూ ఉంటాయి. అయితే దీనిపై టాలీవుడ్ అగ్ర నిర్మాత ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సినిమాకు ముందు టెక్నీషియన్లు ఎలా గేమ్ ఆడతారో తన తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా తమ్ముడు. ఈ సినిమా ప్రమోషన్లలో దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతి సినిమాకు ముందు రిలీజ్ డేట్ ప్రకటించకపోతే టెక్నీషియన్లు తమ పని పూర్తి చేయరని తెలిపారు.
త్వరగా తమ వరకు కంప్లీట్ చేసి ఇస్తే డైరెక్టర్ ఇంకా ఎక్కడ కరెక్షన్లు ఉన్నాయో అని అడుగుతూ ఉంటారని .. చేసిన పనే చేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతో టెక్నీషియన్లు తమ పని ఆలస్యం చేస్తూ వస్తూ ఉంటారని రాజు చెప్పారు. అలా కాకుండా రిలీజ్ డేట్ అనౌన్ చేస్తే ... రిలీజ్ డేట్‌కు కాస్త ముందుగా తమ పని ఫినిష్ చేస్తారని దిల్ రాజు తెలిపారు. ఇక ఇటీవల టెక్నీషియన్లు సైతం వర్క్ విషయంలో నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతోన్న విషయాలు టాలీవుడ్‌లో బయటకు వస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు