గతవారం భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయిన సోషల్ డ్రామా `కుబేర`. శేఖర కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలు పోషించారు. రష్మిక మందన్న, సునైనా, జిమ్ సర్బ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో న‌టించ‌గా.. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. జూన్ 20న విడుదలైన కుబేర చిత్రం హిట్‌ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.


ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కుబేర సినిమాకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. వీకెండ్ ముగిసే టైం కు ఈ చిత్రం ఏపీ మరియు తెలంగాణలో రూ. 22 కోట్ల షేర్ రూ. 38 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ కొల్ల‌గొట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. అయితే తెలుగులో మోత మోగిస్తున్న కుబేరకు.. తమిళంలో మాత్రం పెద్ద షాక్ త‌గిలిచింది. అక్క‌డ ఈ సినిమా అంతంత గానే పెర్ఫార్మ్ చేస్తోంది.


కుబేర తెలుగు, తమిళ్ బైలింగువల్ సినిమా. హీరోగా తమిళ స్టార్ ధనుష్ నటించారు. సినిమా టాక్ అనుకూలంగానే ఉంది. తమిళ విమర్శకులు కూడా కుబేర పై ప్రశంసలు కురిపించారు. అయినప్పటికీ అక్కడి జనాలు ఈ ఎమోషనల్ డ్రామాని సెలబ్రేట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. వీకెండ్ ముగిసే సమయానికి తమిళంలో కుబేర రూ. 11 కోట్ల రేంజ్ లో మాత్రమే వసూళ్లను రాబట్టగలిగింది. సొంత గ‌డ్డ‌పై ఇంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే ధనుష్ ఇమేజ్ డ్యామేజ్ అనే చెప్పుకోవాలి. మరి ఫుల్ ర‌న్‌లో కుబేర కోలీవుడ్ లో ఏం మేరకు వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: