
అసలు విషయంలోకి వెళ్తే అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమాలో మొదట హీరోయిన్స్ శ్రీలీలనే అన్నట్టుగా చిత్ర బృందం అఫీషియల్ గా టైటిల్ గ్లింప్స్ తో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి హీరోయిన్ శ్రీలీల తప్పుకుందనే విధంగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీలీల తప్పుకోవడంతో మేకర్స్ భాగ్యశ్రీ నీ హీరోయిన్గా ఎంపిక చేసినట్లు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీలీల వరుస సినిమాల షూటింగ్ ల వల్ల డేట్లు సర్దుబాటు చేయలేకపోయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
మరి కొన్ని సందర్భాలలో ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందనే విధంగా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. అందువల్లే లెనిన్ సినిమా నుంచి తప్పకుండాట్లుగా వినిపిస్తున్నాయి. శ్రీలీల షూటింగ్ కోసం ఎన్నోసార్లు చిత్ర బృంద షూటింగ్ ని కూడా వాయిదా వేసుకున్నారని.. ఈమె మాత్రం మరికొంత సమయం కావాలని అడగడంతో చిత్ర బృందం వెయిట్ చేయడం కంటే మరో హీరోయిన్ ని వెతకడమే మంచిదని భావించి భాగ్యశ్రీ బోర్సే ను తీసుకున్నట్లు సమాచారం. శ్రీలీల తల్లి చెప్పిన మాట విని బాలీవుడ్ సినిమాకి ఒకే చెప్పి తెలుగు సినిమాను దూరం పెట్టిందనే విధంగా కూడా వినిపిస్తున్నాయి.. ఎది నిజమో తెలియదు కానీ..శ్రీలీల అఖిల్ సినిమా నుంచి తప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.