
ఈ సినిమాలో ప్రభాస్ "రుద్ర" అనే పాత్రలో నటించాడు . ఈ పాత్ర సినిమాకి హైలైట్ గా మారింది. ఎక్కడ చూసినా సరే సినిమాని తెగ పొగిడేస్తున్నారు జనాలు . అందులో కచ్చితంగా ప్రభాస్ పేరు ఉండేలా చూసుకుంటున్నారు. కాగా ఇదే మూమెంట్లో ప్రభాస్ హనురాఘపూడి కాంబోలో తెరకెక్కే సినిమాకు సంబంధించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. హను రాఘవపుడికి ప్రభాస్ వార్నింగ్ ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . వీళ్ళిద్దరి కాంబోలో తరుక్కుతున్న సినిమా "ఫౌజి".. ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు.
కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఇలాంటి మూమెంట్లో ఓ వార్త మీడియాలో హల్చల్ చేస్తుంది . ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది. హను రాఘవపూడి ఏదైనా సరే టెన్షన్ పడిపోయే క్యారెక్టర్ ఉన్న వ్యక్తి . ఏ చిన్న విషయాన్నైనా హడావిడి చేస్తూ త్వర త్వరగా అయిపోవాలి అనుకునే టైప్. ప్రభాస్ అలా కాదు . చాలా సైలెంట్ అండ్ స్లో. కాగా ప్రభాస్ ని ప్రతిసారి హనురాఘపూడి అదే విషయం కారణంగా హెచ్చరిస్తూ వచ్చారట .
కానీ ఈసారి మాత్రం సెట్స్ లో హను రాఘవపూడి కొంచెం హడావిడి చేస్తూ కోపంలో టెక్నీషియన్స్ పై అరిచేసాడట . గొంతు పెద్దది చేసి మాట్లాడడం అక్కడ ఉండే వాళ్లకు సైతం ఇబ్బందికరంగా మారిందట. ఈ క్రమంలోనే ప్రభాస్ కలగజేసుకొని హను రాఘవపుడితో మాట్లాడాడట . ఆయన కూడా హనురాఘవపూడి వినకపోవడంతో కోపంతో షూట్ కి ప్యాకప్ చెప్పి క్యాన్సిల్ చేసి వెంటనే సెట్స్ నుంచి ప్రభాస్ వెళ్లిపోయారట. ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన అయితే లేదు . దీంతో కొంతమంది ఇది ఫేక్ అంటుంటే మరి కొంత మంది ప్రభాస్ లాంటి పెద్ద హీరోకి సంబంధించిన సినిమాల గొడవలు బయటికి రానివ్వరు అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది..!!