డైరెక్టర్ అట్లీ చేస్తున్న పని అల్లు అర్జున్ అభిమానులకి ఫుల్ కోపం తెప్పించేస్తుంది. అసలే స్టంట్స్ భారీ భారీగా చేయిస్తున్నాడు అంటూ ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది . అది కూడా డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ లో బన్నీని చూపించడం బిగ్ సాహసం అంటున్నారు అభిమానులు. కాగా ఇలాంటి మూమెంట్ లోనే సోషల్ మీడియాలో మరొక న్యూస్ వైరల్ గా మారింది . అల్లు అర్జున్ ని తన మొబైల్ షూట్ కి తీసుకురావద్దు అంటూ స్ట్రైట్ గా చెప్పేసాడట డైరెక్టర్ అట్లీ. ఇదే న్యూస్ వైరల్ అవుతుంది .


సాధారణంగా అల్లు అర్జున్ ఎక్కువగా షూటింగ్స్ స్పాట్లో మొబైల్ ని వాడడు.  కానీ ఈ మధ్యకాలంలో ఆయన షూటింగ్ సెట్స్ లో ఎక్కువగా మొబైల్ వాడుతున్నారట.  షాట్ రెడీ అయిన కూడా ఆయన మొబైల్ లోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారట . ఒకటి రెండు సార్లు చూసిన అట్లీ కోపంతో మొబైల్ ఎవరు షూట్ కి తీసుకు రాకూడదు అంటూ కండిషన్ పెట్టారట.  ఎవరు షూట్ కి తీసుకొచ్చినా కూడా వాళ్లపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే విధంగా రూల్ పెట్టారట . అయితే అల్లు అర్జున్ మాత్రం వాటిని  పట్టించుకోకుండా మళ్ళీ అదే విధంగా మొబైల్ షూట్ కి తీసుకొస్తూ ఉండడంతో అట్లీ .. డైరెక్ట్ గా బన్నీకి ఓపెన్ గానే చెప్పేసారట.



షూట్ కి మొబైల్ తీసుకురావద్దు మీకు కార్ వ్యాన్ లోనే పెట్టుకోండి అంటూ గట్టిగానే చెప్పారట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అయితే అట్లీ పెట్టిన కండిషన్ పట్ల బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు . ఎందుకు బన్నీకి మాత్రమే ఇలా జరుగుతుంది . ఆయన ఒక పాన్ ఇండియా హీరో ..మిగతా వాళ్ళు మొబైల్స్ చూసుకున్నా చూసుకోకపోయినా ప్రాబ్లం లేదు . ఆయన లాంటి స్టార్ సెలబ్రిటీకి డైలీ సెకండ్ టు సెకండ్ అప్డేట్స్ ఉంటాయి . మరి మొబైల్ లేకపోతే ఎలా అంటూ ఘాటుగా అట్లీ పెట్టిన కండిషన్ ని తప్పు పడుతున్నారు .



సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ పేర్లు మారుమ్రోగిపోతున్నాయ్. ఆల్రెడీ దీపికా పదుకొనే నీ హీరోయిన్గా పెట్టి అట్లీ తప్పు చేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. ఇదే మూమెంట్లో అట్లికి - అల్లు అర్జున్ కి మధ్య పడట్లేదు అనే విధంగా ఇలా ఒక వార్త ట్రెండ్ అవుతూ ఉండడం సినిమాకి భారీ నెగిటివిటీ తీసుకొచ్చేలా మారింది.  చూడాలి మరి వీళ్ళ కాంబో ఎంతవరకు సక్సెస్ అవుతుందో ..??కాగా అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎప్పుడు కనిపించని ఒక స్పెషల్ లుక్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అంటూ మేకర్స్ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: