సమ్మర్ సీజన్ లో ప్రేక్షకులు లేక వెలవెల పోయిన ధియేటర్లు గత రెండు వారాలుగా ప్రేక్షకులతో సందడిగా నిండుగా కనిపిస్తూ ఉండటంతో తిరిగి ధియేటర్లకు మంచిరోజులు వచ్చాయ అన్న ఆశలు కలుగుతున్నాయి. ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘డాకు మహారాజ్’ ‘తండేల్’ ‘మ్యాడ్ స్క్వేర్’ ‘సింగిల్’ ‘హిట్ 3’ సినిమాలు తప్ప మిగతా సినిమాల వైపు ప్రేక్షకులు పట్టించుకోకపోవడంతో ఎన్నో సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారాయి.



దీనితో అనేకమంది బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా విడుదలైన ‘కుబేర’ ఆసినిమా విడుదలైన కేవలం వారం రోజుల గ్యాప్ తో ‘కన్నప్ప’ మూవీలకు మంచి ఓపెనింగ్స్ రావడం శుభసూచికం అని అంటున్నారు. ఇప్పటికే ‘కుబేర’ 100 కోట్ల మార్క్ ను దాటి ముందుకు పరుగులు తీస్తోంది.



గత వారం విడుదలైన ‘కన్నప్ప’ మూవీ కూడ హిట్ ముద్ర వేయించుకుంది. అయితే ఈసినిమాకు ఖర్చు పెట్టిన భారీ బడ్జెట్ రేంజ్ తో పోల్చుకుంటే ‘కన్నప్ప’ మూవీకి వస్తున్న ప్రస్తుత కలక్షన్స్ ఎంతవరకు ఈమూవీని బ్రేక్ ఈవెన్ స్థాయికి తీసుకువెళుతుంది అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలు కూడ అంచనాలు వేయలేకపోతున్నాయి. అయితే ఈవిషయాలను లెక్కపెట్టకుండా మంచు విష్ణు చాల ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.



ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా లేటెస్ట్ గా విడుదలైన హాలీవుడ్ మూవీ ‘ఎఫ్1’ కు సైతం మంచి ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏ సెంటర్స్ లో ఈ కార్ రేసింగ్ మూవీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు వాస్తున్నాయి. ప్రస్తుతం ధియేటర్లకు వస్తున్న ప్రేక్షకులను హీరో నితిన్ తన ‘తమ్ముడు’ మూవీకి ఎంతవరకు ప్రేక్షకులను రప్పించుకుంటాడు అన్న విషయమై తలలు పండిన ఇండస్ట్రీ ప్రముఖులు కూడ అంచనాలు వేయలేకపోతున్నారు. అయితే హీరో నితిన్ నిర్మాత దిల్ రాజ్ ఈమూవీ పై పెట్టుకున్న ఆశలు ఎంతవరకు నెరవేరుతాయి అన్నది ఈ శుక్రు వారం తేలిపోతుంది దీనితో నితిన్ అభిమానులలో టెన్షన్ మొదలైంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: