ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి మరో మూడు రోజుల్లో రాబోతున్న చిత్రం `తమ్ముడు`. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నితిన్ హీరో కాగా.. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా న‌టించారు. సీనియ‌ర్ బ్యూటీ ల‌య నితిన్ కు అక్క‌గా క‌థ‌లో ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించారు. జూలై 4న త‌మ్ముడు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో అటు హీరో నితిన్‌, ఇటు నిర్మాత దిల్ రాజు క‌లిసి గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే వీరి కాంబోలో ఒక ఇంట‌ర్వ్యూ కూడా ప్లాన్ చేసుకున్నారు.


ఈ ఇంట‌ర్వ్యూలో నితిన్‌, దిల్ రాజు ఇద్ద‌రూ త‌మ్ముడు మూవీ విశేషాల‌నే కాకుండా మ‌రెన్నో ఆస‌క్తిక‌ర సంగ‌త‌లు పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో త‌న‌కున్న బాండింగ్ పై దిల్ రాజు చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. దిల్ రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ `బృందావనం`,  `రామయ్య వస్తావయ్య` వంటి చిత్రాలు చేశారు. వీటిలో ఫ్యామిలీ డ్రామా బృందావ‌నం 2010లో విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది.


అయితే బృందావనం సమయంలోనే దిల్ రాజు, తారక్ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట. తారక్ ను తాను `నాన్న` అని పిలుస్తానని.. మా బంధం అంతా స్నేహపూర్వకంగా ఉంటుందని దిల్ రాజు తాజా ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. బృందావనం మూవీ టైమ్ లో కొడాలి నాని ఎన్టీఆర్ ను నాన్న అని పిలిచేవాడు. ఆ పిలుపు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటినుంచి నేను కూడా తార‌క్ ను నాన్న‌ అనే పిలవడం స్టార్ట్ చేశాను.. న‌న్ను తార‌క్ `అన్న‌` అని పిలుస్తాడ‌ని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: