ఏంటి ఆ లేడీ సింగర్ నిజంగానే భర్తకు విడాకులు ఇచ్చేసిందా.. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే పోస్టులకి అర్థం ఏంటి.. ఇంతకీ ఆ సింగర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గతకొద్ది రోజులుగా చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకునే ముందు తమ సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఎమోషనల్ పోస్టులు చేస్తూ చివరికి తమ బంధం బ్రేకైన విషయాన్ని బయట పెడుతూ ఉన్నారు. రీసెంట్గా నజ్రియా నజీమ్ కూడా తన ఇన్స్టా ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. దీంతో చాలామంది నెటిజన్లు నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్ లు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు క్రియేట్ చేశారు.కానీ ఈ విడాకులు మాత్రమే నజ్రియా,ఫహాద్ లు ఒక్కసారి కూడా స్పందించకపోవడంతో ఈ వార్త నిజమే అని అందరూ అనుకున్నారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ సింగర్ తన సోషల్ మీడియా ఖాతాలో షాకింగ్  పోస్ట్ పెట్టింది. 

ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు ఈ సింగర్ భర్తకు విడాకులు ఇచ్చేసిందని అందుకే భర్తతో విడిపోయిన బంధం గురించి ఈ పోస్ట్ పెట్టిందని మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ సింగర్ ఎవరో కాదు శ్రావణ భార్గవి.. హేమచంద్ర శ్రావణ భార్గవి ఇద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే అంతా సజావుగా సాగుతున్న తరుణంలో వీరిద్దరి మధ్య విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా శ్రావణ భార్గవి తన భర్తతో కనిపించడం లేదు.అలాగే కూతురితో ఒంటరిగా వెకేషన్ లకి వెళ్తుంది.దీంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే విడాకుల వార్తలపై శ్రావణ భార్గవి హేమచంద్ర స్పందించలేదు.

కానీ తాజాగా శ్రావణ భార్గవి తన మీద ఖాతాలో.. జీవితం చాలా చిన్నది.. కానీ ఈ చిన్న జీవితంలో గొడవలు, చిక్కుముళ్ళు, అపార్ధాలు అంటూ బతికేయడం అర్థం లేని జీవితం.. మంచి మనసుతో ఎక్కువ కాలం ప్రేమించడానికి ట్రై చేయాలి. కానీ డీప్ గా ఒకరిని లవ్ చేసినప్పుడు తప్పు చేస్తున్నామా  అనే భావన కలగకూడదని, ఇలాంటి ప్రేమే మనం లైఫ్ లో గెలిచామా.. ఓడామా.. అనేది డిసైడ్ చేస్తుంది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు డౌట్ లేదు శ్రావణ భార్గవి హేమచంద్ర విడాకులు తీసుకున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు.ఇక మరికొంతమందేమో హేమచంద్ర వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండడం గమనించే విడాకులు ఇచ్చేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: