
ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .. ఇక ఈ మూవీలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నట్టు తెలుస్తుంది . అయితే ఎన్టీఆర్ కు జంటగా నటించాలని చాలామంది హీరోయిన్స్ భావిస్తారు . ఎన్టీఆర్ కు జంటగా నటించే అవకాశం వస్తే అసలు ఎవరూ వదులుకోరు ..అయితే త్రిబుల్ ఆర్ తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఎన్టీఆర్ కు జంటగా నటించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు .. అయితే ఇక్కడ ఎన్టీఆర్ కు జంటగా నటించే అవకాశం వస్తే ఓ హీరోయిన్ ఏకంగా మూడుసార్లు నో చెప్పిందట .. ఇంతకీ ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ .. ఈమెకు మూడుసార్లు ఎన్టీఆర్ కు జంటగా నటించే అవకాశం వస్తే .. పలు కారణాలతో ఆమె ఆ అవకాశాన్ని వదిలేసుకుందట .
అయితే వీరిద్దరు కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలు నటించారు .. కానీ అందులో రామ్ చరణ్ కు ఆలియా జంటగా నటించింది .. అలాగే దేవర సినిమాలో కూడా ఎన్టీఆర్ కు జంటగా ఆలియా నటించాల్సి ఉంది .. కానీ ఆ సమయంలో ఆమె ప్రెగ్నెంట్ గా ఉండటంతో అవకాశం కోల్పోయింది .. ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్ సినిమా కోసం సంప్రదించగా .. మరో సినిమాతో బిజీగా ఉండడంతో అది కుదరలేదు .. అలా పలు కారణాలతో ఎన్టీఆర్ కు జంటగా నటించే అవకాశం మూడుసార్లు వదులుకుంది .. దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది .