
అలాగే మంచి ఫామ్ లో ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ సంవత్సరం ది గర్ల్ ఫ్రెండ్ తో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .. లేడీ ఓరియంటెడ్ సినిమాగా ఇప్పటికే భారీ క్రేజ్ తెచ్చుకుంది ఈ మూవీ ..రిలేషన్షిప్ లో కాంప్లిట్ చూసిన అమ్మాయిగా ఈ మూవీలో రష్మిక నటించారు .. అలాగే ఆమె కెరియర్ లో ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమాగా ది గర్ల్ ఫ్రెండ్ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది .. అలాగే జానకి వర్సెస్ ది స్టేట్ ఆఫ్ కేరళలో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ పరదా ..
మూఢనమ్మకాలు, మహిళ సాధికారత వంటి అంశాలతో వస్తుంది పరదా .. ఇప్పటికే అవుట్ ఫుట్ బావుందనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది .. అలాగే మెగా కోడలు ప్రెగ్నెన్సీ లీవ్ లో ఉన్న లావణ్య త్రిపాఠి నటించిన సినిమా సతీ లీలావతి .. కుటుంబ బంధాలను నిలవడానికి వివాహత ఏం చేసిందనే ఇష్యూతో ఈ మూవీ రాబోతుంది .. ప్రధానంగా భార్యాభర్తల అనుబంధాన్ని ఎలివేట్ చేసినట్టు ఈ చిత్ర యూనిట్ చెబుతుంది .. ఇలా స్టార్ హీరోయిన్లు అంతా 2025 సెకండ్ హాఫ్‌లో స్టార్ హీరోలకు దీటుగా తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేయడానికి సైటున్నారు.. ఇక మరి వీరిలో ఎవరు సరైన సక్సెస్ అందుకుంటారో చూడాలి ..