ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జనాలు ఎక్కువగా మాట్లాడుకునే టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా మంచు ఫ్యామిలీ గురించి అనే చెప్పాలి.  మంచు అన్నదమ్ములు ఇద్దరు ఆస్తులు పంపకాల విషయంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు మీడియాలో వీళ్ళ గురించి రకరకాలుగా వార్తలు వినిపించాయి. మంచు మనోజ్ తన వాయిస్ ని అందరికీ తెలిసే విధంగా వినిపించగా ..మంచు విష్ణు చాలా సైలెంట్ గా వ్యవహారంలో పరిస్థితులని తన వైపు తిప్పుకున్నాడు అంటూ టాక్ వినిపించింది.


ఫ్యామిలీ పరంగా ఎలా ఉన్నా సినిమాల పరంగా మాత్రం వీళ్ళ మధ్య వార్ పిక్స్ కి చేరుకున్నింది అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు . మంచు మనోజ్ - మంచు విష్ణు నటనకు బిక్ బ్రేక్ ఇచ్చేలా చాలా ఏళ్ల తర్వాత నటులుగా మళ్లీ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకున్నారు . మంచు మనోజ్ ప్రధాన పాత్రలో "భైరవం"  సినిమాలో నటించారు . ఇక మంచు  విష్ణు తన కెరియర్ ని మలుపు తిప్పే కన్నప్ప సినిమాలో నటించాడు . కన్నప్ప సినిమాలో హీరో మాత్రమే కాదు కన్నప్ప కి కర్త - కర్మ - క్రియ ఇలా అన్ని తానై వ్యవహరించి జనాల జత శభాష్ అనిపించుకున్నాడు .



నిజానికి మంచు మనోజ్ - మంచు విష్ణు నటించిన భైరవం - కన్నప్ప సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయి అని అప్పట్లో టాక్ వినిపించింది . ఆ తర్వాత ఒక నెల గ్యాప్ లోనే థియేటర్స్ లో విడుదలయ్యాయి.  భైరవం చిత్రాన్ని కన్నప్ప కి పోటీగా విడుదల చేయాలి అంటూ మేకర్స్ భావించిన ఆ తర్వాత వెనకడుగు వేస్తూ మంచు మనోజ్ నటించిన భైరవం సినిమా మే 30వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. కలెక్షన్స్ పరంగా పెద్దగా ఆకట్టుకుంది అని చెప్పలేకపోయినా మనోజ్ పాత్ర మాత్రం హైలెట్ అయింది.  మనోజ్ పాత్రకు మంచి రివ్యూస్ వచ్చాయి. విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించేశారు అంటే మనోజ్ పాత్ర ఎంత హైలెట్ అయిందో అర్థం చేసుకోవచ్చు .



ఇక జూన్ 27వ తేదీ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ అయింది.  ఇది క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. సినిమాలో హీరోగా విష్ణు నటించిన క్రెడిట్ మొత్తం ప్రభాసే కొట్టేశాడు. కానీ లాస్ట్ 45 నిమిషాల సమయంలో విష్ణు చేసిన పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది అంటూ ఆర్జీవి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా పొగిడేశారు.  చాలామంది విష్ణు పర్ఫామెన్స్ ను బాగా మెచ్చుకున్నారు. లాస్ట్ 40 నిమిషాల సీన్స్ విష్ణు కి మంచి మార్కులు తెచ్చిపెట్టాయి.



మంచు విష్ణు కెరియర్ లో ది బెస్ట్ సినిమా అంటే ఇదే అని కూడా జనాలు మాట్లాడుకున్నారు . దీంతో  విష్ణు కూడా మంచి హిట్ కొట్టినట్లు అయింది.  కాగా ఇప్పుడు మంచు మనోజ్ - మంచు విష్ణు ఈ ఇద్దరి సినిమాలలో ఎవరి సినిమా హిట్ ఎవరి సినిమా ఫట్ ..?? అనే విధంగా పోల్స్ కనిపిస్తున్నాయి . చాలామంది రెండు సినిమాలకు రివ్యూస్ బాగానే ఇస్తున్నారు.  కొంతమంది మనోజ్ కి సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది విష్ణుకు సపోర్ట్ చేస్తున్నారు.  కానీ చాలామంది ఇద్దరినటన బాగుంది అని మోహన్ బాబు ఇద్దరు కొడుకులు కూడా చాలా కాలం తర్వాత మళ్లీ మంచి నటులుగా గుర్తింపు సంపాదించుకున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు . ఇందులో గెలుపు ఎవరిది అనడం కన్నా కూడా ఇద్దరు గెలిచారు అనే చెప్పాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: