సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఏ చిన్న పోస్ట్ పెట్టినా కూడా అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా నయనతార పెట్టిన అలాంటి ఒక పోస్టే నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఆ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఇదేంటి నయనతార ఇలాంటి షాకింగ్ పోస్ట్ పెట్టింది..విడాకుల గురించి ఏమైనా హింట్ ఇచ్చిందా అని షాక్ అయిపోతున్నారు. మరి ఇంతకీ లేడీ సూపర్ స్టార్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఆ పోస్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా నయనతార తన సోషల్ మీడియా ఖాతాలో "ఒక స్టుపిడ్ ని వివాహం చేసుకుంటే పెళ్లి అనేది పెద్ద తప్పు అనిపిస్తుంది. కానీ భర్త చేసిన ప్రతీ దానికి భార్య బాధ్యత తీసుకోవద్దు. నన్ను ఒంటరిగా వదిలేయండి" అంటూ నయనతార తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక స్టోరీ పెట్టింది.

అయితే ఈ స్టోరీ పెట్టిన కొద్ది క్షణాల్లోనే మళ్లీ ఆ స్టోరీని డిలీట్ చేసినట్టు తెలుస్తోంది.అయితే నయనతార పెట్టిన ఆ స్టోరీని కొంతమంది వైరల్ అవ్వడంతోనే స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో మళ్లీ రీ పోస్ట్ పెడుతూ నయనతార విడాకుల గురించే ఈ పోస్ట్ పెట్టింది అని నయనతార విఘ్నేష్ శివన్ తో విడాకులు తీసుకోబోతుంది అని కామెంట్లు పెడుతున్నారు. అయితే మరి కొంతమందేమో నయనతార జీవితంలో వేణు స్వామి చెప్పిందే జరగబోతోంది.. ఎందుకంటే వేణు స్వామి నయనతారకు పెళ్లి జీవితం కలిసి రాదని ఆమె పెళ్లి చేసుకున్నా కూడా ఖచ్చితంగా విడాకులు తీసుకుంటుందని ఆ మధ్య కాలంలోనే చెప్పారు. 
ఇదంతా చూస్తూ ఉంటే నయనతార నిజంగానే భర్తకు విడాకులు ఇచ్చేలా కనిపిస్తోంది అని మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ ఫేక్ స్క్రీన్ షాట్ అని,అది నయనతార పేరు మీద కొంతమంది ఆకతాయిలు పెట్టిన పోస్ట్ అని కొంతమంది కొట్టి పారేస్తున్నారు. మరి నయనతార విగ్నేష్ శివన్  తో నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా.. నయనతారనే ఆ పోస్ట్ పెట్టిందా లేక అది ఫేక్ పోస్టా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ నయనతార పేరుతో ఉన్న ఈ పోస్ట్ మాత్రం సామాజిక మాధ్యమాల్లో సంచలనం  సృష్టిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: