పవన్ కళ్యాణ్ అంటే ముందుగా వినిపించేది పవర్ స్టార్ . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . పవర్ స్టార్ అన్న పదం లేకుండా పవన్ కళ్యాణ్ పేరు కనిపించదు వినిపించదు . ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే.  పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అని బిరుదు ఎప్పటి నుంచో వస్తుంది . అయితే ఇప్పుడు పవర్ స్టార్ ని పవర్ స్టార్ అని కాదు రియల్ స్టార్ అంటూ పిలవాలి అని నిర్మాత ఏఎం రత్నం హరిహర వీరమల్లు ట్రైలర్ లాంఛ్ లో మాట్లాడారు . దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా హరిహర వీరమల్లు . ఈ సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యి అభిమానులను బాగా ఆకట్టుకునింది .


అభిమానులను పూర్తిగా ఎంటర్టైన్ చేసింది . మరి ముఖ్యంగా ఇన్నాళ్ల తన కెరియర్లో ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న స్టోరీని పవన్ కళ్యాణ్ చూస్ చేసుకోనే లేదు . ఈ సినిమాకి కాన్సెప్ట్ హైలైట్.  ఇక పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.  ఏ క్యారెక్టర్ కి తగ్గట్టు ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతాడు . జూలై 24వ తేదీ ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో ఏం రత్నం మాట్లాడుతూ.." పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఇప్పటిదాకా పిలిచారు అని ..ఈ సినిమా చూసిన తర్వాత పవర్ స్టార్ కాదు రియల్ స్టార్ అని అంటారు అని.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊపు తెప్పించే విధంగా మాట్లాడారు".



చాలామందికి కూడా ఇక పవర్ స్టార్ అనే ట్యాగ్ పవన్ కళ్యాణ్ తీసేయొచ్చు అని.. రియల్ స్టార్ గా ఆయన ట్యాగ్ కంటిన్యూ చేయాలి అని ..అటు పాలిటిక్స్ లో ఇటు సినిమాలల్లో రియల్ స్టార్ గా ఆయన తన సత్తా ఏంటో చూపిస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పవర్ స్టార్ కన్నా రియల్ స్టార్ ఏ బాగుంది అంటూ ఓ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ని ప్రశంసించేస్తున్నారు . చూడాలి మరి హరిహర వీరమల్లు సినిమా ఎలాంటి హిట్ టాక్ అంటుకుంటుందో..?? జులై 24వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.  ఆ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండుగనే చెప్పాలి . ట్రైలర్ టాక్ అయితే బాగుంది మరి సినిమా టాక్ ఎలా ఉంటుందో..?? తెలియాలి అంటే జూలై 24 వరకు ఆగాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: