"కన్నప్ప".. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ . అంతేకాదు చాలామంది స్టార్స్ నటించిన ఒక బిగ్ ప్రాజెక్ట్ . జూన్ 27వ తేదీ రిలీజ్ అయ్యి ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది.  అంతకుముందే మంచు విష్ణు  రివ్యూవర్స్ కి రివ్యూ రాసే వాళ్ళకి సివియర్ స్ట్రైట్ వార్నింగ్ కూడా ఇచ్చారు . సినిమా బాగుంది అంటే బాగుంది అని రాయండి ..బాగోలేదు అంటే బాగోలేదు అని రాయండి.. బాగున్న బాగోలేదు అని రాస్తే మాత్రం అస్సలు ఊరుకోం.. లీగల్గా యాక్షన్ తీసుకుంటామంటూ స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారు . మరి దాని ఎఫెక్ట్ నా..? లేకపోతే నిజంగానే సినిమా జనాలు అందరికీ బాగా నచ్చేసిందో..?? రివ్యూస్ మాత్రం బాగా పాజిటివ్ గానే వచ్చాయి .


మరీ ముఖ్యంగా సినిమాలో హీరో మంచి విష్ణు అయినా సినిమా 80% హిట్ అవ్వడానికి కారణం టోటల్ ప్రభాస్ క్యారెక్టర్ అంటూ చాలామంది జనాలు మాట్లాడుకున్నారు . ఆఫ్ కోర్స్ సినిమాలో మిగతా స్టార్స్ కూడా ఉన్నారు. కాజల్ అగర్వాల్ - అక్షయ్ కుమార్ - మోహన్లాల్ - మోహన్ బాబు ఇలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ అందరి అటెన్షన్ తనపై తీసుకునేలా మంచి క్యారెక్టర్ ని చూస్ చేసుకున్నాడు ప్రభాస్ . ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ హైలెట్ అనే చెప్పాలి . అసలు ఈ సినిమా మొత్తానికి కర్త - కర్మ - క్రియ ప్రభాస్ అంటూ రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేశారు.



ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కన్నప్ప సినిమా ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అయింది అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రైమ్ వీడియో ..నెట్ ఫ్లిక్స్ వంటి రెండు ప్రముఖ ఓటిటీ ప్లాట్ఫారంలు కన్నప్ప డిజిటల్ హక్కుల కోసం భారీ స్థాయిలో  పోటీపడుతున్నట్లు తెలుస్తుంది. ఇంకా డీల్ మాత్రం కుదరచలేదట మంచు విష్ణు . అయితే కన్నప్ప  సినిమా ఓటీటీకి  రావాలి అంటే మంచి విష్ణు కొన్ని కండిషన్స్ పెట్టారట . ఈ సినిమాకు మంచి స్పందన వచ్చి సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం థియేటర్లో విడుదలైన సినిమా కనీసం 8 వారాల తర్వాతే ఓటిటిలోకి తీసుకురావాలి అంటూ కండిషన్ పెట్టారట . అంతేకాదు ఇది థియేట్రికల్ రన్ కి పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలని తమ ఆలోచన అని కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది .



అంతేనా ఒకవేళ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే సాధారణంగా నాలుగు వారాలలో ఓటీటీలో విడుదల చేయడానికి అంగీకరించినట్లు టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది . ఈ షరతులే ఓటీటీ లో సినిమా స్ట్రీమింగ్ అవ్వడానికి ఇంకా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది.  మొత్తంగా సెప్టెంబర్ పైనే ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు సినిమా చూడడానికి వేచి చూస్తున్నారు . అలాంటి వాళ్ళకి ఇంకొంచెం టైం పట్టేలా నే ఉంది. కాగా  ఇప్పటికే కన్నప్ప హిందీ శాటిలైట్ హక్కులు భారీ  ధరకు అమ్ముడుపోయాయని సమాచారం.  దాదాపు 20 కోట్లకు పైగా హిందీ శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయట.  ఇంకా ఓటిటి హక్కులు కొలిక్కి రాలేదు అంటూ తెలుస్తుంది.  మంచి ఆఫర్ వస్తే డీల్ క్లోజ్ చేస్తామనే ఆలోచనలో మంచు విష్ణు ఉన్నట్లు తెలుస్తుంది . చూడాలి మరి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్  రైట్స్ దక్కించుకుంటుందో..?? నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంటుందో  అనేది ..? కొందరు మాత్రం మంచు విష్ణు బిజినెస్ మైండ్ ని పొగిడేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: