- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. వీరిద్దరి కలయికలో అతి త్వరలోనే ఓ సినిమా పట్టాలెక్క పోతుంది. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఓవైపు చక చకగా సాగిపోతున్నాయి. ఈ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిక్స్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ ఇమేజ్ కి బాగా సూట్ అయ్యే టైటిల్ ఇది. టైటిల్ వినగానే ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్ అందరిలోనూ కలుగుతుంది. త్రివిక్రమ్ కూడా అందుకు అనుగుణంగానే కథను రాసుకున్నట్టు తెలుస్తోంది. ఇక గతంలో వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ వెంకటరమణ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి.


ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది ? ఇప్పటివరకు తేలలేదు. అయితే త్రిష పేరు గట్టిగా వినిపిస్తోంది. వెంకటేష్ - త్రిష ది సూపర్ హిట్ కాంబినేషన్. అయితే ఈ సినిమాకు హీరోయిన్ డేట్లు బల్క్ గా కావాలి. మరి త్రిష ఇన్ని డేట్లు ఇస్తుందా లేదా అన్న అనుమానం ఉంది. అలాగే రుక్మిణి వసంతన్‌ పేరు కూడా పరిగణలో ఉంది. ఆమె కూడా ఫుల్ బిజీగా ఉంది. హీరోయిన్గా ఈ ఇద్దరిలో ఒకరి పేరు ఖరారు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంగీత ద‌ర్శ‌కుడి గా మిక్కీ జే మేయర్ కే ఛాన్స్ ఉందంటున్నారు. ఆ.. ఆ సినిమా తర్వాత మీక్కీ తో త్రివిక్రమ్ పనిచేయలేదు. అందుకే ఈసారి మిక్కీ వైపు ముగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: