"సంక్రాంతికి వస్తున్నాం".. అంత ఈజీగా మర్చిపోగలమా ఈ సినిమాని..??  బిగ్ బడా సూపర్ స్టార్స్ నటించిన సినిమాలకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది . అంతేకాదు సంక్రాంతికి ఫ్యామిలీ ఫ్యామిలీని ధియేటర్స్ కి రప్పించుకుంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో స్పీక్స్ కి వెళ్ళిపోయింది అని చెప్పడంలో సందేహమే లేదు.  కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది..  అదే సంక్రాంతికి వస్తున్నాం 2.  ఎన్నెన్నో సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి . మరి ఇలాంటి హిట్ సినిమాలకి సీక్వెల్ రాదా..? అని ఎంతో మంది జనాలు మాట్లాడుకున్నారు .


కచ్చితంగా "సంక్రాంతికి వస్తున్నాం 2" సినిమా ఉంది అనే విధంగా ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఐశ్వర్య రాజేష్ . తెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో ఎక్కువగా సినిమాలల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఐశ్వర్య రాజేష్ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో భాగ్యం పాత్రలో నటించి తెలుగు ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్రను వేసుకుంది . ఈ సినిమాలో వెంకటేష్ కి భార్యగా నలుగురి పిల్లల తల్లిగా నటించి మెప్పించింది . తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలకు ఐశ్వర్య హాజరయ్యారు.



అక్కడ ఆమె మాట్లాడుతూ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు . "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా లో తన క్యారెక్టర్ చాలా తనకు నచ్చేసింది అని చెప్పుకు వచ్చారు. అంతేకాదు ఇలాంటి క్యారెక్టర్ లు చేయడానికి వయస్సు అడ్డు కాదు అని కూడా క్లారిటీ ఇచ్చింది. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో నలుగురు పిల్లలకు తల్లిగా నటించాను నేను.. ఒకవేళ ఆ సినిమాకు పార్ట్ 2 ఉంటే ఖచ్చితంగా ఆరుగురు పిల్లలు ఉంటారు అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తనతో చెప్పారు అన్న విషయాన్ని తానా సభలో ఐశ్వర్య వెల్లడించారు.  ఐశ్వర్య మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . దీంతో సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమా కథను కూడా రెడీ చేసుకుని ఉన్నాడా ..? అనిల్ రావిపూడి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  అంతా ఓకే గాని మీనాక్షి చౌదరి పాత్రే ఇందులో డౌట్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . ఆమె ప్లేస్ లో క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్ ను పెడితే బాగుంటుంది అన్న సజెషన్స్ ఎక్కువగా ఇస్తున్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..????

మరింత సమాచారం తెలుసుకోండి: