"అనిల్ రావిపూడి"..సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ట్ డైరెక్టర్ . రీసెంట్ గానే "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ చిరంజీవితో సినిమాని  తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా 50% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అంటూ ఆయన స్వయంగా ప్రకటించారు.  అంతే కాదు ఈ సినిమాలో నయనతారను ఆయన హీరోయిన్ గా చూస్ చేసుకున్నారు . అనిల్ రావిపూడి సినిమా అంటే ప్రమోషన్లకు కేరాఫ్ అడ్రస్ . నయనతార అంటే ప్రమోషన్స్ అస్సలు చేయదు.  మరి ఎందుకు అనిల్ రావిపూడి ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను చూస్ చేసుకున్నాడు అంటూ చాలామంది ఆయనను ట్రోల్ చేశారు .


కానీ అనిల్ రావిపూడి మాత్రం తన సినిమా పనులు తాను చేసుకుంటూ బిజీ అయిపోయారు. కాకపోతే రీసెంట్ గా సుడిగాలి సుధీర్ గురించి ఆయన స్పందించారు . సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటి సంపాదించుకున్నారు . ఆ తర్వాత సినిమాల్లో కూడా వచ్చాడు . కానీ హీరోగా క్లిక్ అవ్వలేకపోయారు.  మళ్ళీ పలు షోస్ కి ఈవెంట్ లు నిర్వహించుకుంటూ తన బిజీ లైఫ్ ముందుకు తీసుకెళుతున్నాడు.  ఇదే క్రమంలో పలు షోస్ లో  సుడిగాలి సుధీర్ పై వల్గర్ గా వేసే పంచెస్ అభిమానులకు ఎంతో హర్ట్టింగ్గా గా ఉంటాయి . చాలామంది అభిమానులు దీనిపై రియాక్ట్ కూడా అయ్యారు .



అయితే ఇదే ఇష్యూ పై అనిల్ రావిపూడి స్పందించారు . సుధీర్ చాలా చాలా కష్టపడతాడు.. చాలా మంచోడు.. ఎవరిని ఏమీ అనడు.. సుధీర్ పై ఎందుకు పంచులు వేస్తారో నాకు తెలియదు . సుధీర్ ని రోస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చదు.  సుధీర్ పై ఎందుకు పంచులు వేయాలి అని నాకు ఎప్పుడూ అనిపించేది . కానీ ఆ షోలో అలా చేయమని .. సుధీర్ ని రోస్ట్ చేయడమే కాన్సెప్ట్ అని చెప్పేవాళ్ళు ..షో మేనేజ్మెంట్ ఎలా చెప్తే అలానే చేయాలి ..  ఆ కారణంగానే ఆయనపై ఇష్టం లేకపోయినా పంచులు వేశాను.. అవి హద్దులు దాటినట్లు కూడా కొన్ని కొన్ని సార్లు నాకు అనిపిస్తాయి ..సున్నితంగా అనిపించేవి ..సుధీర్ మాత్ర, ఇవన్నీ పెద్దగా పట్టించుకోడు.. జనాలు నవ్వడమే నాకు కావాలి అనుకుంటాడు.. మీరేమి ఇబ్బంది పడకండి సార్ అని నాకు చాలా సార్లు చెప్పాడు. అతను అంటే నాకు చాలా చాలా ఇష్టం " అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.  దీంతో సుధీర్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం సుధీర్ పలు షోస్ ని హౌస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: